News March 31, 2024

కోవూరు :రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి

image

కోవూరు మండలంలోని పడుగుపాడు రైల్వేగేటు సమీపంలో రైలు కిందపడి సుమారు 55 సంవత్సరాల వయసు గల గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందిన సంఘటన శనివారం జరిగింది.కావలి జీఆర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.మృతుడి చొక్కాపై విజయలక్ష్మి టైలర్,గాంధీపార్కు,కోవూరు అని రాసి ఉందని,స్థానికుడిగా భావిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.

Similar News

News March 11, 2026

నెల్లూరు జిల్లాలో గ్యాస్ కష్టాలు..!

image

యుద్ధం ఎఫెక్ట్‌తో నెల్లూరు జిల్లాలో గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. బుచ్చి మండలంలో గతంలో బుకింగ్ చేసిన 24 గంటల్లో డెలీవరీ చేస్తుండగా.. ఇఫ్పుడు రెండు రోజులకూ ఇవ్వడం లేదు. బ్లాక్‌లో విక్రయించుకునేందుకు డీలర్లు కొరత సృష్టిస్తున్నారని ప్రజలు అనుమానిస్తున్నారు. సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించి సకాలంలో సిలిండర్ అందేలా చూడాలని కోరుతున్నారు. మీ ఏరియాలో పరిస్థితి ఏంటో కామెంట్ చేయండి.

News March 11, 2026

నెల్లూరులో భారీగా మొబైల్ ఫోన్లు సీజ్

image

నెల్లూరులోని పలు మొబైల్స్, ఎలక్ట్రానిక్స్ దుకాణాలపై అధికారులు దాడులు చేశారు. సరైన బిల్లులు, GST చెల్లించకుండా విక్రయిస్తున్న రూ.49.24 లక్షల విలువైన మొబైల్స్, ఎలక్ట్రానిక్స్ పరికరాలను సీజ్ చేశారు. ఈ సరుకును వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు అప్పగించారు. జై అంబికా, శ్రీ అంబికా, జేపీ మొబైల్స్ షాపుల్లో విజిలెన్స్ ఇన్‌స్పెక్టర్ నరసింహారావు, DCTO విష్ణు రావు దాడులు చేశారు.

News March 11, 2026

నెల్లూరు: meesho- ఉమెన్స్ డే గిఫ్ట్ పేరుతో లింకు వైరల్

image

సామాజిక మాధ్యమాల్లో meesho ప్రశ్నావళి అని, ప్రశ్నలకు సమాధానం చెబితే లక్ష వరకు గిఫ్ట్ గెలుచుకోవచ్చని ఓ లింకు వైరల్‌గా మారింది. ఈ లింకును క్లిక్ చేస్తే.. వారు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని వస్తుంది. ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు ఆఫర్ 12వ తేదీ వరకు ఉన్నట్లు చూపిస్తుంది. అయితే ఇలాంటి లింకులను నమ్మవద్దని అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.