News August 7, 2025

విశాఖ: లూజ్‌లో పెట్రోల్ అమ్మకాలు

image

విశాఖలోని పలు పెట్రోల్ బంకులు నిబంధనలకు తూట్లు పొడుస్తున్నాయి. డైరీ ఫారం సమీపంలోని ఓ బంక్‌లో లూజు పెట్రోల్ అమ్ముతున్నారు. దీంతో కల్తీ పెట్రోల్ అమ్మకాలతో పాటు నేరాల చేసేందుకు ఆస్కారం ఉంది. అధికారులు స్పందించి లూజ్ విక్రయాలు నివారించాలని ప్రజలు కోరుతున్నారు.

Similar News

News August 10, 2025

గాజువాక సమీపంలో యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

image

గాజువాక సమీపంలో జగ్గు జంక్షన్ కర్నవాణిపాలెం వద్ద అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ను ట్రాలర్ ఢీకొట్టిన ఘటనలో ఏ.మోహన్ కుమార్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు గాజువాక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు అదే ప్రాంతానికి చెందినవాడిగా గుర్తించారు.

News August 10, 2025

విశాఖలోని హోటల్స్‌, రెస్టారెంట్లలో తనిఖీలు

image

విశాఖలోని పలు హోటల్స్, రెస్టారెంట్లపై సివిల్ సప్లై అధికారులు దాడులు నిర్వహించారు. కమర్షియల్ సిలిండర్లకు బదులు గృహ వినియోగ సిలిండర్లను వాడుతున్నట్లు గుర్తించి 44 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. వీరందరిపై 6ఏ కేసులు నమోదు చేస్తున్నట్లు సివిల్ సప్లై అధికారులు తెలిపారు. వ్యాపారులు డొమెస్టిక్ సిలిండర్లు వాడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

News August 10, 2025

విశాఖ నుంచి బయలుదేరే పలు రైళ్లు రద్దు

image

విశాఖ నుంచి బయలుదేరే పలు రైళ్లు రద్దు చేసినట్లు వాల్తేరు డివిజన్ డీసీఎం సందీప్ శనివారం తెలిపారు. విశాఖ-రాయపూర్ పాసింజర్ (58527/28), విశాఖ – కోరాపూట్ పాసింజర్ (58537/38), విశాఖ – భవానిపట్నం పాసింజర్ (58503/04)ను ఆగస్టు 19 నుంచి 28 వరకు రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ప్రయాణికులు గమనించాలని సూచించారు.