News March 31, 2024
BIG ALERT: ఈ మండలాల్లో వడగాలులు
AP: రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత పెరిగింది. నిన్న 7 మండలాల్లో తీవ్ర వడగాలులు, 52 మండలాల్లో వడగాలులు వీచినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇవాళ 33 మండలాలు, రేపు 64 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. అన్ని జిల్లాల్లో 40 నుంచి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. వడగాలుల ప్రభావం ఉండే మండలాల జాబితాను ఇక్కడ <
Similar News
News January 2, 2025
రైతు భరోసాపై నేడు క్యాబినెట్ సమావేశం
TG: రైతు భరోసాపై క్యాబినెట్ సబ్‌కమిటీ నేడు సమావేశం కానుంది. సచివాలయంలో ఉదయం 11గంటలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. మంత్రులు తుమ్మల, ఉత్తమ్, శ్రీధర్ బాబు పాల్గొంటారని సమాచారం. రైతు భరోసా విధివిధానాలను ఈ సమావేశంలో ఖరారు చేసే అవకాశం ఉంది. సంక్రాంతికి ముందే రైతు భరోసాను విడుదల చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
News January 2, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News January 2, 2025
జనవరి 2: చరిత్రలో ఈరోజు
1918: స్వాతంత్ర్య పోరాట యోధుడు బత్తిని మొగిలయ్య గౌడ్ జననం
1957: హాస్యనటుడు ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం (AVS) జననం
1958: నటుడు ఆహుతి ప్రసాద్ జననం
1959: భారత మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ జననం
1945: హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు మరణం
1954: భారతరత్న, పద్మవిభూషణ్ పురస్కారాల ప్రారంభం