News August 7, 2025
చివర్లో కోలుకున్న మార్కెట్లు.. గ్రీన్‌లో క్లోజ్

ఆరంభంలో భారీగా నష్టపోయిన స్టాక్‌మార్కెట్లు ట్రంప్ టారిఫ్స్ భయాన్ని అధిగమించి ఆఖర్లో లాభాల్లో ముగిశాయి. ఇన్వెస్టర్లు చివరి గంటలో కొనుగోళ్ల వైపు మొగ్గు చూపడంతో మార్కెట్లు కోలుకున్నాయి. సెన్సెక్స్ 79 పాయింట్లు లాభపడి 80,623, నిఫ్టీ 21 పాయింట్లు వృద్ధి చెంది 24,596 పాయింట్ల వద్ద క్లోజ్ అయ్యాయి. టెక్ మహీంద్రా, HCL టెక్, ఎటర్నల్, AXIS బ్యాంక్, మారుతీ, టాటా స్టీల్, HDFC బ్యాంక్ షేర్లు లాభాల్లో ముగిశాయి.
Similar News
News August 10, 2025
ముగిసిన ‘ఆడుదాం ఆంధ్ర’ స్కామ్ విచారణ

AP: గత ప్రభుత్వ హయాంలో ‘ఆడుదాం ఆంధ్ర’ కార్యక్రమంలో జరిగిన స్కామ్‌పై విచారణ ముగిసింది. ఇందుకు సంబంధించిన రిపోర్టును త్వరలో విజిలెన్స్ అధికారులు డీజీపీకి సమర్పించనున్నారు. కాగా ‘ఆడుదాం ఆంధ్ర’ కార్యక్రమంలో స్పోర్ట్స్ కిట్స్, ఈవెంట్స్ పేరిట అవినీతి జరిగిందనే ఆరోపణలతో ప్రభుత్వం విజిలెన్స్ విచారణ చేపట్టిన విషయం తెలిసిందే.
News August 10, 2025
18 ఏళ్లు దాటాయా? అయితే..

ఇటీవల 30 ఏళ్లలోపు యువతలోనూ గుండెపోటు మరణాలు పెరుగుతున్నాయి. ఆడుతూ, జిమ్, డాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలుతున్నారు. ఆస్పత్రికి తరలించేలోపే చనిపోతున్నారు. జన్యుపరమైన కారణాలు, జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిళ్లు, సిగరెట్, మద్యం, డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల వినియోగం కూడా గుండెపోటు మరణాలకు కారణమని డాక్టర్లు చెబుతున్నారు. 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ టెస్టులు చేయించుకోవాలని సూచిస్తున్నారు.
News August 10, 2025
పంచాయతీ ఎన్నికలు.. BIG UPDATE

TG: పంచాయతీ ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న అభ్యర్థులు లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉన్న రూల్‌ను రద్దు చేసే ఛాన్సున్నట్లు సమాచారం. పంచాయతీరాజ్ చట్టం-2018 సెక్షన్ 21(3)ని తొలగించే ప్రతిపాదనను క్యాబినెట్ ముందు ఉంచనున్నట్లు చర్చ మొదలైంది. BCలకు 42% రిజర్వేషన్లు కల్పించాలంటే ఈ మార్పు అవసరమని ప్రభుత్వం భావిస్తోంది.