News August 7, 2025
చరిత్ర సృష్టించిన జింబాబ్వే ప్లేయర్ టేలర్

జింబాబ్వే ఆటగాడు బ్రెండన్ టేలర్(39) చరిత్ర సృష్టించారు. 21వ శతాబ్దంలో లాంగెస్ట్ ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడిన ప్లేయర్‌గా టేలర్ (21Y 93D) రికార్డు నెలకొల్పారు. ఈ క్రమంలో అండర్సన్ (21Y 51D) రికార్డును చెరిపేశారు. టేలర్ 2004 మే 6న అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టారు. 2022లో నిషేధానికి గురై న్యూజిలాండ్‌తో టెస్టులో ఈరోజు రీఎంట్రీ ఇచ్చారు. ఇవాళ టేలర్‌తో ఓపెనింగ్ చేసిన బెన్నెట్ 2004 నాటికి 5 నెలల పసికందు.
Similar News
News August 10, 2025
చర్చలు ఫలించకుంటే.. రేపటి నుంచి షూటింగ్‌లు బంద్: ఫిల్మ్ ఫెడరేషన్

TG: వేతనాలు పెంచాలని సినీ కార్మికులు చేస్తున్న ఆందోళనలకు మద్దతుగా రేపటి నుంచి చిత్రీకరణలు పూర్తిగా నిలిపేస్తున్నట్లు ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ ప్రకటించారు. ఇప్పటికే షెడ్యూల్ ఉంటే 2 రోజులు సమయమిస్తామని, ఆ తర్వాత అవి కూడా నిలిపివేస్తామని హెచ్చరించారు. ఈరోజు జరిగే చర్చలపైనే ఇదంతా ఆధారపడి ఉంటుందని తెలిపారు. కార్మికుల శ్రమకు తగిన వేతనాల కోసమే తాము ఈ పోరాటం చేస్తున్నట్లు ఆయన చెప్పారు.
News August 10, 2025
పులివెందుల ZPTC ఉపఎన్నిక.. ఓటుకు రూ.10,000

AP: ఈ నెల 12న జరిగే పులివెందుల ZPTC ఉపఎన్నికను TDP, YCP ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికలను తలపించేలా ఇరు పార్టీలు నువ్వా నేనా అనేలా వ్యూహాలు రచిస్తున్నాయి. జగన్‌కు కంచుకోటైన స్థానంలో తమ పట్టు నిలుపుకునేందుకు ఓటుకు ₹10,000 ఇచ్చేందుకు లీడర్లు సిద్ధమైనట్లు సమాచారం. పులివెందులతో పాటు ఒంటిమిట్ట ZPTCలను గతంలో YCPనే గెలవగా, తిరిగి కైవసం చేసుకోవడానికి తీవ్ర కసరత్తు చేస్తోంది.
News August 10, 2025
ముగిసిన ‘ఆడుదాం ఆంధ్ర’ స్కామ్ విచారణ

AP: గత ప్రభుత్వ హయాంలో ‘ఆడుదాం ఆంధ్ర’ కార్యక్రమంలో జరిగిన స్కామ్‌పై విచారణ ముగిసింది. ఇందుకు సంబంధించిన రిపోర్టును త్వరలో విజిలెన్స్ అధికారులు డీజీపీకి సమర్పించనున్నారు. కాగా ‘ఆడుదాం ఆంధ్ర’ కార్యక్రమంలో స్పోర్ట్స్ కిట్స్, ఈవెంట్స్ పేరిట అవినీతి జరిగిందనే ఆరోపణలతో ప్రభుత్వం విజిలెన్స్ విచారణ చేపట్టిన విషయం తెలిసిందే.