News August 7, 2025

అందుకే ఢిల్లీకి వచ్చాం: సీఎం రేవంత్ రెడ్డి

image

TG: బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని 2 బిల్లులు తీసుకొచ్చామని, 4 నెలలైనా వాటిని రాష్ట్రపతి ఆమోదించడం లేదని CM రేవంత్ రెడ్డి అన్నారు. ‘ఏకగ్రీవ ఆమోదంతోనే బిల్లులను ఢిల్లీకి పంపాం. BC రిజర్వేషన్ల కోసం క్షేత్రస్థాయిలో అన్ని ప్రయత్నాలు చేశాం. జాతీయ స్థాయిలో పోరాడేందుకే ఢిల్లీకి వచ్చాం. రిజర్వేషన్లు 50శాతానికి మించకూడదని BRS చట్టం చేసింది. దాన్ని అధిగమించేందుకు ఆర్డినెన్స్ తెచ్చాం’ అని CM తెలిపారు.

Similar News

News August 20, 2025

తిరుమల కొండపైకీ మహిళలకు ఉచిత ప్రయాణం

image

AP: తిరుమల కొండపైకి కూడా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు ఆ సంస్థ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ తెలిపారు. కానీ ఘాట్ రోడ్ కావడం వల్ల సిట్టింగ్ వరకు పర్మిషన్ ఇచ్చామన్నారు. ఒక్కో బస్సులో దాదాపు 50 మంది కూర్చుని ప్రయాణించవచ్చని పేర్కొన్నారు. ఆస్పత్రులు, పుణ్యక్షేత్రాలు, కార్యాలయాలు, బంధువుల ఇళ్లకు వెళ్లే మహిళలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారని చెప్పారు.

News August 20, 2025

RAJIV GANDHI: 40 ఏళ్లకే ప్రధానమంత్రి

image

భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి నేడు. 1984లో 40 ఏళ్ల వయసులోనే రాజీవ్ PMగా బాధ్యతలు స్వీకరించారు. ఐటీ రంగాన్ని దేశానికి పరిచయం చేసి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. తన హయాంలో టెక్నాలజీకి పెద్దపీట వేశారు. టెలీ కమ్యూనికేషన్స్, రక్షణ, వాణిజ్య, విమానయాన సంస్కరణలు ప్రవేశపెట్టారు. విద్యావకాశాల సమానత్వం కోసం నేషనల్ పాలసీ ఫర్ ఎడ్యుకేషన్‌ను తీసుకొచ్చారు. 1991 మే 21న జరిగిన ఆత్మాహుతి దాడిలో మరణించారు.

News August 20, 2025

పరగడుపున పసుపు నీరు తాగితే?

image

ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో పసుపుతో పాటు తేనె, అల్లం, నిమ్మరసం కలిపి పరగడుపున తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆర్థరైటిస్, మధుమేహం, కీళ్ల నొప్పులు, గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతాయి. మొటిమలు తగ్గి, చర్మం కాంతివంతంగా మారుతుంది. పసుపులోని యాంటీఆక్సిడెంట్స్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు రక్తాన్ని శుద్ధిచేస్తాయి. ఇందులోని కర్కుమిన్ క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తుంది.