News August 7, 2025
మతాల ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వడం లేదు: CM రేవంత్

TG: బీసీలకు 42శాతం రిజర్వేషన్ల పేరిట ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నామని బీజేపీ వితండవాదం చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. గుజరాత్, యూపీలో ముస్లింలకు బీజేపీ రిజర్వేషన్లు కల్పిస్తోందని ఢిల్లీలో ప్రెస్‌మీట్ సందర్భంగా గుర్తుచేశారు. తాము ఎక్కడా మతాల ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. సామాజిక, ఆర్థిక వెనుకబాటుతనం ఆధారంగా కల్పిస్తున్నామని పునరుద్ఘాటించారు.
Similar News
News August 18, 2025
ఉక్రెయిన్ అలా చేస్తేనే యుద్ధం ఆగుతుంది: ట్రంప్

రష్యాతో యుద్ధాన్ని ముగించాలంటే ఉక్రెయిన్ రెండు కీలక ఒప్పందాలకు అంగీకరించాల్సిందేనని US అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు. రష్యా ఆక్రమించిన క్రిమియాను తిరిగి దక్కించుకోవాలనే ఆలోచనను, NATO కూటమిలో చేరాలనే ఆశను విరమించుకుంటే యుద్ధం తక్షణమే ముగిసిపోతుందని ఆయన జెలెన్‌స్కీకి సూచించారు. అటు రష్యాకు భూమి ఇవ్వడం కుదరదని జెలెన్‌స్కీ తెగేసి చెప్పారు. దీంతో ఇవాళ ట్రంప్‌తో ఆయన భేటీ ఆసక్తికరంగా మారింది.
News August 18, 2025
మోదీ ప్రకటన.. లాభాల్లో స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 1,100, నిఫ్టీ 360 పాయింట్లు లాభపడ్డాయి. GST సంస్కరణలు ఉంటాయన్న ప్రధాని మోదీ ప్రకటనతో మార్కెట్లు దూసుకెళ్తున్నాయి. ఆటోమొబైల్, FMCG స్టాక్స్ లాభాల్లో ఉన్నాయి. HCL Tech, ITC, L&T, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
News August 18, 2025
బహుజన బందూక్ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్

మొగల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడిన బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి నేడు. జనగామ జిల్లాలో సామాన్య కుటుంబంలో జన్మించినప్పటికీ తన పోరాట పటిమతో నిజాం రాజులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. పేద ప్రజల పక్షాన నిలబడి, అప్పటి దోపిడీ వ్యవస్థను ఎదిరించారు. ఆయన పోరాటానికి నిదర్శనంగా HYDలోని ట్యాంక్‌బండ్‌పై విగ్రహం ఏర్పాటు చేసేందుకు CM రేవంత్ ఇవాళ శంకుస్థాపన చేయనున్నారు.