News August 7, 2025
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రేపు విచారణకు బండి

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును కేంద్రం సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. రేపు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విచారణకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ నుంచి వచ్చిన SIB, కౌంటర్ ఇంటెలిజెన్స్‌తో పాటు AP, TG పోలీస్ ఉన్నతాధికారులతో ఆయన భేటీ అయి సుదీర్ఘంగా చర్చించారు. గత ప్రభుత్వం బండి ఫోన్‌ను అత్యధికసార్లు ట్యాప్ చేసినట్లు పోలీసులు నిర్ధారించినట్లు సమాచారం.
Similar News
News August 20, 2025
తిరుమల కొండపైకీ మహిళలకు ఉచిత ప్రయాణం

AP: తిరుమల కొండపైకి కూడా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు ఆ సంస్థ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ తెలిపారు. కానీ ఘాట్ రోడ్ కావడం వల్ల సిట్టింగ్ వరకు పర్మిషన్ ఇచ్చామన్నారు. ఒక్కో బస్సులో దాదాపు 50 మంది కూర్చుని ప్రయాణించవచ్చని పేర్కొన్నారు. ఆస్పత్రులు, పుణ్యక్షేత్రాలు, కార్యాలయాలు, బంధువుల ఇళ్లకు వెళ్లే మహిళలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారని చెప్పారు.
News August 20, 2025
RAJIV GANDHI: 40 ఏళ్లకే ప్రధానమంత్రి

భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి నేడు. 1984లో 40 ఏళ్ల వయసులోనే రాజీవ్ PMగా బాధ్యతలు స్వీకరించారు. ఐటీ రంగాన్ని దేశానికి పరిచయం చేసి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. తన హయాంలో టెక్నాలజీకి పెద్దపీట వేశారు. టెలీ కమ్యూనికేషన్స్, రక్షణ, వాణిజ్య, విమానయాన సంస్కరణలు ప్రవేశపెట్టారు. విద్యావకాశాల సమానత్వం కోసం నేషనల్ పాలసీ ఫర్ ఎడ్యుకేషన్‌ను తీసుకొచ్చారు. 1991 మే 21న జరిగిన ఆత్మాహుతి దాడిలో మరణించారు.
News August 20, 2025
పరగడుపున పసుపు నీరు తాగితే?

ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో పసుపుతో పాటు తేనె, అల్లం, నిమ్మరసం కలిపి పరగడుపున తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆర్థరైటిస్, మధుమేహం, కీళ్ల నొప్పులు, గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతాయి. మొటిమలు తగ్గి, చర్మం కాంతివంతంగా మారుతుంది. పసుపులోని యాంటీఆక్సిడెంట్స్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు రక్తాన్ని శుద్ధిచేస్తాయి. ఇందులోని కర్కుమిన్ క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తుంది.