News August 7, 2025
ఉపరాష్ట్రపతి అభ్యర్థిని మోదీ ఫైనల్ చేస్తారు: కిరణ్ రిజుజు

ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ప్రధాని మోదీ, BJP జాతీయ అధ్యక్షుడు JP నడ్డా ఎంపిక చేస్తారని కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు తెలిపారు. ఢిల్లీలో జరిగిన NDA నేతల కీలక సమావేశం అనంతరం కిరణ్ మీడియాతో మాట్లాడారు. ‘తొలుత కొందరిని నడ్డా ఎంపిక చేస్తారు. ఆ తర్వాత వారిలో ఒకరిని మోదీ ఫైనల్ చేస్తారు. వచ్చే నెల 9లోగా అభ్యర్థి పేరు ఖరారు చేస్తాం’ అని ఆయన పేర్కొన్నారు. కాగా ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఇవాళ నోటిఫికేషన్ విడుదలైంది.
Similar News
News August 10, 2025
బీజేపీకి ఓటు షేర్ పెరుగుతోంది: రామ్‌చందర్ రావు

తెలంగాణలో బీజేపీకి ఓటు షేర్ పెరుగుతోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్‌చందర్ రావు అన్నారు. బీజేపీకి సున్నా అని గతంలో విమర్శించిన బీఆర్ఎస్ పనే ప్రస్తుతం సున్నా అయ్యిందని ఎద్దేవా చేశారు. గువ్వల బాలరాజు బీజేపీలో చేరిన సందర్భంగా రామ్‌చందర్ రావు మాట్లాడారు. ‘ఓట్ల గురించి మాట్లాడే అర్హత రాహుల్ గాంధీకి లేదు. ఓడిపోతారని తెలిసే ఓట్ల చోరీ ఆరోపణలు చేస్తున్నారు’ అని మండిపడ్డారు.
News August 10, 2025
ఒకే ఫ్రేమ్‌లో మెగా హీరోస్.. పిక్ వైరల్

మెగా హీరోలు రామ్‌చరణ్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్ జిమ్‌లో చెమటోడ్చుతున్నారు. ఈ సందర్భంగా జిమ్ ట్రైనర్‌తో కలిసి వారు ఫొటోకు పోజులిచ్చారు. ఇందుకు సంబంధించిన పిక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన ఫ్యాన్స్ మెగా హీరోలను ఒకే ఫ్రేమ్‌లో చూడటం సంతోషంగా ఉందని కామెంట్లు చేస్తున్నారు. కాగా ‘పెద్ది’తో చెర్రీ, ‘VT 15’తో వరుణ్, ‘SDT 18’తో సాయి ధరమ్ బిజీగా ఉన్నారు.
News August 10, 2025
విభేదాలు అన్ని పార్టీల్లో ఉన్నాయి: కవిత

TG: బీఆర్ఎస్‌లో అంతర్గత విభేదాలపై ఎమ్మెల్సీ కవిత మరోసారి స్పందించారు. ‘ఇలాంటివి అన్ని పార్టీల్లో ఉంటాయి. సీఎం రేవంత్ ఏదైనా ప్రకటన చేయగానే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెంటనే వ్యతిరేకిస్తున్నారు. బీజేపీలో బండి సంజయ్‌ని ఉద్దేశిస్తూ ఈటల రాజేందర్ డైరెక్ట్ వార్నింగ్ ఇస్తున్నారు. ఇలా అన్ని పార్టీల్లో ఏదో ఒకటి నడుస్తూనే ఉంది. అందులో పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు’ అని వ్యాఖ్యానించారు.