News August 7, 2025

భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండండి: సీఎం రేవంత్

image

TG: రాష్ట్రంలో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలపై CM రేవంత్ స్పందించారు. ‘భారీ వర్షాల సమాచారం దృష్ట్యా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి. జిల్లాల్లోని అన్ని విభాగాలతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలి. HYDలో భారీ వర్షసూచన దృష్ట్యా అధికారులు సమన్వయంతో పని చేయాలి. వర్షాలతో ఇబ్బందులు పడుతున్న ప్రాంతాలకు వెంటనే సంబంధిత సిబ్బంది చేరుకొని చర్యలు చేపట్టాలి’ అని ఆదేశించారు.

Similar News

News August 12, 2025

మందుబాబులకు శుభవార్త

image

AP ప్రభుత్వం మందుబాబులకు తీపికబురు అందించింది. మద్యం షాపుల వద్ద పర్మిట్ రూమ్‌లు ఏర్పాటు చేసేందుకు అనుమతిస్తూ ఎక్సైజ్ రూల్-2024కు సవరణ చేసింది. పర్మిట్ రూమ్‌లు లేకపోవడం వల్ల బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతూ 2.77 లక్షల మంది పట్టుబడినట్లు పేర్కొంది. పొలాలు, పార్కులు, రోడ్ల పక్కన మద్యం సేవించడాన్ని తగ్గించేలా లైసెన్స్‌తో కూడిన పర్మిట్ రూమ్‌లు ఏర్పాటు చేసేందుకు అనుమతించినట్లు వెల్లడించింది.

News August 12, 2025

‘వార్ 2’కు టికెట్ రేట్ల పెంపు.. ఎంతంటే

image

ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన ‘వార్ 2’ మూవీకి టికెట్ రేట్లు పెంచుతూ AP ప్రభుత్వం జీవో జారీ చేసింది. సింగిల్ స్క్రీన్లలో రూ.75, మల్టీప్లెక్సుల్లో రూ.100 చొప్పున పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఎల్లుండి రిలీజ్ రోజు ఉదయం 5 గంటలకు స్పెషల్ షోకు రూ.500 టికెట్ ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుంది. టికెట్ రేట్లు ఈనెల 23 వరకు కొనసాగనున్నాయి. మరోవైపు తెలంగాణలో మాత్రం ఈ సినిమాకు టికెట్ రేట్ల పెంపు లేదు.

News August 12, 2025

ఈ ఎన్నికలను రద్దు చేయాలి: YS జగన్

image

AP: పులివెందుల, ఒంటిమిట్ట ఎన్నికలను తీవ్రవాదుల్లా టీడీపీ నేతలు హైజాక్ చేశారని YS జగన్ Xలో ఫైరయ్యారు. ‘చంద్రబాబు గుండాలా అరాచకాలు చేశారు. రౌడీల రాజ్యం నడిపిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని గాయపరిచిన ఈరోజు బ్లాక్‌డే. ఆయన CMగా ఉండగా ప్రజాస్వామ్యం డొల్లని రుజువైంది. చట్టం, న్యాయం, ధర్మం, నిబంధనలు ఒట్టిమాటలే. ఈ ఎన్నికలను రద్దు చేసి, కేంద్ర బలగాల ఆధ్వర్యంలో మళ్లీ నిర్వహించాలి’ అని జగన్ డిమాండ్ చేశారు.