News August 7, 2025
పోలీసులు, టీడీపీ నేతల కుమ్మక్కు: బొత్స

AP: రాష్ట్రంలో పోలీసులు, TDP నేతలు కుమ్మక్కై YCP నేతలపై దాడులకు పాల్పడుతున్నారని ఆ పార్టీ నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. కూటమి సర్కార్ దుష్ట పాలన చేస్తోందని మండిపడ్డారు. గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను బొత్స, కారుమూరి, కొట్టు, వెల్లంపల్లి కలిశారు. ‘కూటమి ప్రభుత్వ అరాచకాలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయగా సానుకూలంగా స్పందించారు. ప్రజాస్వామ్యబద్ధంగా పులివెందుల ZPTC ఎన్నిక నిర్వహించాలని కోరాం’ అని తెలిపారు.
Similar News
News August 8, 2025
AP న్యూస్ రౌండప్

☛ విజయవాడలో పారిశ్రామిక వేత్తలతో P4 కార్యక్రమంపై చర్చించిన CM చంద్రబాబు.. రాష్ట్రంలో జీరో పావర్టీ లక్ష్యంగా పనిచేస్తున్న ప్రభుత్వంతో కలిసి రావాలని పిలుపు
☛ సెలూన్లకు ఉచిత విద్యుత్ పరిమితి 150 నుంచి 200 యూనిట్లకు పెంపు
☛ ఈనెల 9న అల్లూరి జిల్లా పాడేరుకు CM చంద్రబాబు
☛ రెవెన్యూ భూముల ఆరోపణలపై విచారణ జరిపించాలని CM చంద్రబాబుకు బొత్స లేఖ
News August 8, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News August 8, 2025
ఆగస్టు 8: చరిత్రలో ఈ రోజు

1870: తెలుగు కవి, అవధాని చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి జననం
1981: మాజీ టెన్నిస్ ఆటగాడు రోజర్ ఫెడరర్ జననం
1987: స్వాతంత్ర్య సమరయోధుడు, కవి గురజాడ రాఘవశర్మ మరణం
2004: సినీ నృత్య దర్శకుడు పసుమర్తి కృష్ణమూర్తి మరణం
1994: ఒలింపిక్ మెడలిస్ట్ మీరాబాయి చాను జననం
☛ క్విట్ ఇండియా దినోత్సవం
☛ జాతీయ డాలర్ దినోత్సవం