News August 7, 2025
గ్యాస్ సిలిండర్ పేలుడు ప్రమాద బాధితులు వీరే..

విశాఖ ఫిషింగ్ హార్బర్ సమీపంలో వెల్డింగ్ దుకాణంలో గ్యాస్ సిలిండర్ పేలుడు ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడి కేజీహెచ్ క్యాజువాలిటీలో చికిత్స పొందుతున్నారు. వారి వివరాలు: బుక్క వీధి ఫిషింగ్ హార్బర్ ఏరియాకి చెందిన చింతకాయల ముత్యాలు (27), మిథిలాపురి వుడా కాలనీకి చెందిన ఎర్ర ఎల్లాజీ (45), రాజీవ్ నగర్‌కి చెందిన టి.సన్యాసిరావు(46), చంగల్ రావు పేటకు చెందిన ఇప్పిలి రంగారావు (53).
Similar News
News August 8, 2025
వినాయకచవితికి ఆంక్షలు: CP

వినాయకచవితి సందర్భంగా భద్రతపై నగర పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించి గురువారం పోలీస్ కమిషనరేట్ హాల్లో CP శంఖబ్రత బాగ్చీ నిర్వహణ కమిటీలతో భేటీ అయ్యారు. మండపాల ఏర్పాట్లకు ముందు విద్యుత్, అగ్నిప్రమాద నివారణ చర్యలు, నిమజ్జన మార్గాలు, లౌడ్ స్పీకర్ పరిమితులు, DJ నిషేధం, సీసీటీవీ నిఘా, అనుమానాస్పద వ్యక్తులపై అప్రమత్తత, ఫేక్ న్యూస్ నివారణపై స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు.
News August 7, 2025
మాస్టర్ ప్లాన్ రోడ్ల అభివృద్ధి ప్రక్రియను వేగవంతం చేయాలి: కలెక్టర్

విశాఖలో మాస్టర్ ప్లాన్ రోడ్ల అభివృద్ధి ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ పేర్కొన్నారు. అన్ని రకాల సాంకేతిక అంశాలను, టెండర్ల ప్రక్రియలను త్వరితగిన పూర్తి చేయాలన్నారు. గురువారం తన ఛాంబర్లో సమావేశం నిర్వహించారు. VMRDA పరిధిలో చేపట్టాల్సిన 25 మాస్టర్ ప్లాన్ రోడ్లపై సమీక్షించారు. 2026 జూన్, జూలై నాటికి రోడ్లు అందుబాటులోకి వచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు.
News August 7, 2025
సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ప్రారంభం కోసం ఎంపీ శ్రీభరత్ విజ్ఞప్తి

విశాఖ ఎంపీ శ్రీభరత్ కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను గురువారం కలిశారు. విజయదశమి నాటికి సౌత్ కోస్ట్ రైల్వేజోన్ కార్యాలయాన్ని పూర్తి స్థాయిలో ప్రారంభించేలా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. తిరుపతి ఎక్స్‌ప్రెస్, బెంగళూరు వందే భారత్ స్లీపర్, హైదరాబాద్ రాత్రి ఎక్స్‌ప్రెస్‌లను విశాఖ నుంచి ప్రారంభించాలని సూచించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఇది మద్దతు ఇస్తుందన్నారు.