News August 7, 2025
ఈసీపై రాహుల్ వ్యాఖ్యలు సిగ్గుచేటు: BJP

ECపై సంచలన <<17330640>>వ్యాఖ్యలు<<>> చేసిన INC నేత రాహుల్ గాంధీపై BJP ధ్వజమెత్తింది. రాహుల్ కామెంట్స్ సిగ్గుచేటని, ప్రజల తీర్పును ఆయన అవమానిస్తున్నారని దుయ్యబట్టింది. కాంగ్రెస్‌కు ప్రజలు అధికారం ఇవ్వకపోవడంతో రాహుల్‌లో కోపం, అసహనం పెరిగిపోయాయని BJP MP రవిశంకర్ ప్రసాద్ విమర్శించారు. అందుకే ECపై అసంబద్ధ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆయనది ఇలాంటి క్యారెక్టర్ కాబట్టే ప్రజలు INCని పక్కన పెట్టారని ఎద్దేవా చేశారు.
Similar News
News August 8, 2025
ఈ నెల 28 నుంచి దులీప్ ట్రోఫీ.. కెప్టెన్లు వీరే

దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీ-2025 ఈ నెల 28 నుంచి బెంగళూరులోని BCCI సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ గ్రౌండ్‌లో జరగనుంది. నార్త్ జోన్ కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్, సెంట్రల్ జోన్‌కు ధ్రువ్ జురెల్, ఈస్ట్ జోన్‌కు ఇషాన్ కిషన్, సౌత్ జోన్‌కు తిలక్ వర్మ, వెస్ట్ జోన్‌కు శార్దూల్ ఠాకూర్‌ను కెప్టెన్లుగా నియమించారు. వీరిలో ఎవరైనా జాతీయ జట్టుకు ఆడాల్సి వస్తే ఆయా ప్లేయర్ల స్థానాలను వేరే ఆటగాళ్లతో భర్తీ చేస్తారు.
News August 8, 2025
HYDలో వర్షాలు.. అత్యవసర హెల్ప్‌లైన్లు ఇవే

హైదరాబాద్‌లో వర్షం పడితే చాలు రోడ్లను వరద ముంచెత్తుతోంది. నిన్న సాయంత్రం నుంచి రాత్రి వరకు కుండపోత వర్షం పడటంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. రోడ్లపై ట్రాఫిక్ జామ్‌తో వాహనాలు గంటలకొద్దీ నిలిచిపోయాయి. వర్షం, వరద సమయంలో ఏదైనా సాయం అవసరమైతే సంప్రదించాలని సూచిస్తూ అధికారులు ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నంబర్లను ప్రకటించారు. పైనున్న ఫొటోలో వివరాలు ఉన్నాయి.
News August 8, 2025
EP30: ఇలా చేస్తే శత్రువులు కూడా ప్రశంసిస్తారు: చాణక్య నీతి

తెలివి, జ్ఞానం ఉన్న వారికి అన్ని చోట్ల గౌరవం లభిస్తుందని చాణక్య నీతి చెబుతోంది. ‘జీవితంలో ప్రతి దశలోనూ వీలైనంత జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఆ జ్ఞానాన్ని ఇతరులకు పంచాలి. నిజాయితీగా, సంస్కారవంతంగా ఉంటే ఎవరూ మీ ప్రతిష్ఠను దెబ్బతీయలేరు. చేసే ప్రతీ పనిని ప్రేమించాలి. గొప్ప నైపుణ్యాలు ప్రదర్శిస్తే సంబంధిత రంగాల్లో గౌరవం, డబ్బు లభిస్తాయి. నైపుణ్యాలు చూసి శత్రువులూ ప్రశంసిస్తారు’ అని బోధిస్తోంది.