News March 31, 2024
వాలంటీర్లూ జర జాగ్రత్త

AP: వాలంటీర్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ సస్పెన్షన్‌కు గురవుతున్న సంఘటనలు చూస్తున్నాం. అయితే ఇది వారి భవిష్యత్తుకు ఏ మాత్రం మంచిది కాదంటున్నారు విశ్లేషకులు. చాలా మంది వాలంటీర్లుగా పని చేస్తూ ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారు. పబ్లిక్ సర్వెంట్ కేటగిరీలోకి వచ్చే వీరిపై ఎన్నికల సంఘం ఆదేశాలతో సస్పెన్షన్ వేటు పడినా, ఉద్యోగం కోల్పోయినా ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులవుతారని హెచ్చరిస్తున్నారు.
Similar News
News January 27, 2026
రైలు ఆలస్యంతో పరీక్షకు గైర్హాజరు.. విద్యార్థినికి రూ.9లక్షల పరిహారం

UPలోని బస్తీ జిల్లాకు చెందిన సమృద్ధి అనే విద్యార్థిని 7ఏళ్ల న్యాయ పోరాటం తర్వాత రైల్వేపై కేసు గెలిచింది. 2018లో రైలు ఆలస్యం వల్ల ఆమె Bsc ప్రవేశ పరీక్ష రాయలేకపోయింది. దీంతో పరిహారం కోరుతూ జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించింది. రైలు ఆలస్యమవడంపై అధికారుల నుంచి సరైన వివరణ రాకపోవడంతో ఆమెకు 45 రోజుల్లో రూ.9.10L చెల్లించాలని కోర్టు ఆదేశించింది. చెల్లింపు ఆలస్యమైతే 12% వడ్డీ చెల్లించాలని పేర్కొంది.
News January 27, 2026
జనవరి 27: చరిత్రలో ఈరోజు

1922: బాలీవుడ్ నటుడు అజిత్ ఖాన్ జననం
1927: తెలుగు కవి, రచయిత పోతుకూచి సాంబశివరావు జననం
1936: కథా, నవలా రచయిత్రి కోడూరి కౌసల్యాదేవి జననం
2009: భారత మాజీ రాష్ట్రపతి రామస్వామి వెంకట్రామన్ మరణం
2023: సినీ నటి జమున మరణం (ఫొటోలో)
* కుటుంబ అక్షరాస్యత దినోత్సవం
News January 27, 2026
పొలిటికల్ వెపన్‌లా సిట్ నోటీసులు: హరీశ్ రావు

TG: రేవంత్ ప్రభుత్వం సిట్ నోటీసుల్ని పొలిటికల్ వెపన్‌లా వాడుతోందని హరీశ్ రావు అన్నారు. కోల్ స్కామ్‌పై ప్రశ్నించడంతో పబ్లిక్ అటెన్షన్‌ను డైవర్ట్ చేసేందుకు తనకు, KTRకు నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. ఈ స్కామ్‌పై గవర్నర్‌కు ఫిర్యాదు చేయాలని BRS నిర్ణయించిన కొన్ని గంటల్లోనే మాజీ ఎంపీ సంతోష్‌కు నోటీసులు వచ్చాయన్నారు. కాగా మంగళవారం గవర్నర్‌ను కలిసి సింగరేణి కుంభకోణంపై వివరాలు ఇవ్వనున్నట్లు BRS తెలిపింది.


