News August 8, 2025

ఫ్యామిలీతో మాట్లాడేందుకు తహవ్వుర్ రాణాకు అనుమతి

image

26/11 ముంబై ఉగ్రదాడి కేసు నిందితుడు తహవూర్ రాణాకు ఫ్యామిలీతో ఫోన్ కాల్స్ మాట్లాడేందుకు ఢిల్లీ కోర్టు అనుమతి ఇచ్చింది. అతడు తన కుటుంబ సభ్యులతో మాట్లాడి ప్రైవేట్ లాయర్‌ను నియమించుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతడికి ఢిల్లీ లీగల్ సర్వీసెస్ అథారిటీకి చెందిన న్యాయవాది న్యాయ సహాయ సలహాదారుగా ఉన్నారు. అంతకుముందు ఫ్యామిలీతో మాట్లాడేందుకు రాణా చేసిన దరఖాస్తును తిహార్ జైలు అధికారులు వ్యతిరేకించారు.

Similar News

News August 8, 2025

‘కాంతార-1’ హీరోయిన్ లుక్ రివీల్

image

హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కాంతార-1’ సినిమా నుంచి హీరోయిన్ పోస్టర్ విడుదలైంది. ‘కనకవతిని పరిచయం చేస్తున్నాం’ అంటూ రుక్మిణీ వసంత్ లుక్‌ను మేకర్స్ రివీల్ చేశారు. రాణిగా రుక్మిణి ఎంతో బ్యూటిఫుల్‌గా ఉందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. హొంబలే ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ‘కాంతార-1’ చిత్రం అక్టోబర్ 2న విడుదలవనుంది.

News August 8, 2025

లైంగిక సమ్మతికి 18 ఏళ్లు తప్పనిసరి: కేంద్రం

image

లైంగిక సమ్మతికి వయోపరిమితిని 18 నుంచి 16 ఏళ్లకు తగ్గించాలని సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌పై కేంద్రం స్పందించింది. ‘లైంగిక సమ్మతికి 18 ఏళ్లు దాటాల్సిందే. మైనార్టీ తీరని వారిని లైంగిక మోసాల నుంచి కాపాడేందుకు బాగా ఆలోచించి ఈ విధానం అమలు చేస్తున్నాం. యువతీ యువకుల మధ్య శృంగార భరిత ప్రేమ పేరుతో ఈ పరిమితిని తగ్గించడం ప్రమాదకరం. తగ్గిస్తే పిల్లల అక్రమ రవాణా, బాలలపై నేరాలు పెరుగుతాయి’ అని అభిప్రాయపడింది.

News August 8, 2025

నేను చాలా ఎమోషనల్: రష్మిక

image

తాను చాలా ఎమోషనల్ పర్సన్ అని, భావోద్వేగాలను అందరి ముందు ప్రదర్శించనని హీరోయిన్ రష్మిక చెప్పారు. చాలా మంది తన దయాగుణాన్ని ఫేక్ అని అనుకోవడమే కారణమని చెప్పారు. ఎంత నిజాయితీగా ఉంటే అంత వ్యతిరేకత వస్తుందని, నెగిటివిటీ, ట్రోలింగ్‌ను ఎదుర్కోవడం చాలా కష్టమన్నారు. తన ప్రయాణంపై దృష్టి పెట్టి క్రమశిక్షణతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ బ్యూటీ మైసా, ది గర్ల్‌ఫ్రెండ్ చిత్రాల్లో నటిస్తున్నారు.