News March 31, 2024
పాకిస్థాన్ కెప్టెన్‌గా బాబర్ ఆజమ్

పాకిస్థాన్ క్రికెట్ టీమ్ కెప్టెన్‌గా బాబర్ ఆజమ్‌ను ఆ దేశ క్రికెట్ బోర్డు నియమించింది. వన్డేలు, టీ20లకు ఆయన కెప్టెన్‌గా వ్యవహరిస్తారని ప్రకటన విడుదల చేసింది. సెలక్షన్ కమిటీలోని సభ్యులందరూ బాబర్ పేరునే ప్రతిపాదించారని, దీంతో పీసీబీ ఛైర్మన్ అతడిని కెప్టెన్‌గా నియమించినట్లు పేర్కొంది. గత ఏడాది వన్డే వరల్డ్ కప్ అనంతరం బాబర్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.
Similar News
News February 5, 2026
వారికి తెలిసే తప్పు చేశారు: పవన్

AP: వేంకటేశ్వరుడి ముందు మోకరిల్లి YCP వాళ్లు క్షమాపణలు చెప్పాలని Dy.CM పవన్ డిమాండ్ చేశారు. ‘ఏ నివేదికలోనూ క్లీన్ చిట్ రాలేదు. జంతువుల కొవ్వు కలిసిందని చెప్పడం చాలా సున్నితమైన అంశం. 2022లోనే కల్తీ కలిసిందని రిపోర్టులు వస్తే వాటిని తొక్కిపెట్టారు. వాళ్లకి అంతా తెలిసే చేశారు. తిరుమలకు 2 కొండలు చాలు అనే ధోరణి నుంచి వచ్చిన పార్టీ మీది. రథం కాలిపోతే పిచ్చోడు చేశారు అంటారు’ అని వ్యాఖ్యానించారు.
News February 5, 2026
ICAR-IARIలో ఉద్యోగాలు

ఢిల్లీలోని ICAR-ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(<
News February 5, 2026
YCP భగవంతుడిపై పగ పట్టింది: పవన్

AP: YCP హయాంలో హిందూత్వంపై అనేక దాడులు జరిగాయని Dy.CM పవన్ పేర్కొన్నారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై కూటమి మీడియా సమావేశం నిర్వహించింది. ‘వీళ్లు భగవంతుడిపై పగబట్టారు. 59.70 లక్షల కిలోల కల్తీ పామాయిల్‌తో చేసిన కోట్ల లడ్డూల్లో కొన్ని అయోధ్య కూడా పంపారు. వీళ్లు చెప్పిన కల్తీ నెయ్యికి సంబంధించి ఆన్ రికార్డ్ సాక్ష్యాలు కూడా దొరికాయి. భగవంతుడిపై పగబట్టిన వాళ్లు సర్వనాశనం అయిపోతారు’ అని పేర్కొన్నారు.


