News August 8, 2025
అప్డేటెడ్ ఆధార్ ఉంటేనే ఉచిత ప్రయాణం: అధికారులు

TG: RTC బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించాలంటే ఆధార్ కార్డు అప్‌డేట్ అయి ఉండాలని అధికారులు స్పష్టం చేశారు. ఫొటోతో పాటు తెలంగాణ చిరునామా కార్డుపై అప్‌డేట్ అయి ఉండాలని పేర్కొన్నారు. ఇటీవల నిర్మల్(D) భైంసా నుంచి NZB వెళ్తున్న బస్సులో కొందరు మహిళలు ఉమ్మడి AP ఆధార్ కార్డు చూపించగా జీరో టికెట్ ఇచ్చేందుకు కండక్టర్ నిరాకరించారు. దీంతో మహిళలు <<17319477>>ఆగ్రహించిన<<>> సంగతి తెలిసిందే.
Similar News
News August 8, 2025
ఇండియాలో సురక్షితమైన నగరాలు ఇవే!

Numbeo Safety Index mid-2025 ర్యాంకింగ్స్ ప్రకారం ప్రపంచంలో సురక్షిత దేశాల జాబితాలో భారత్ 67వ స్థానంలో నిలిచింది. మన దేశంలో మంగళూరు, వడోదర, అహ్మదాబాద్, సూరత్, జైపూర్, నవీ ముంబై, తిరువనంతపురం, చెన్నై, పుణే, చండీగఢ్ టాప్-10లో చోటు దక్కించుకున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్క సిటీకి కూడా చోటు దక్కలేదు. ప్రపంచంలో సురక్షితమైన నగరాల్లో అబుదాబి, దోహా, దుబాయ్, షార్జా, తైపీ టాప్-5లో ఉన్నాయి.
News August 8, 2025
VIRAL: తెల్లగడ్డంతో విరాట్ కోహ్లీ!

టెస్టులు, T20Iలకు రిటైర్మెంట్ ప్రకటించిన టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం లండన్‌లో కుటుంబంతో కలిసి ఉంటున్నారు. తాజాగా ఆయన దిగిన ఫొటో ఒకటి వైరలవుతోంది. అందులో కోహ్లీ మునుపెన్నడూ లేనంతగా నెరిసిన గడ్డం, మీసాలతో ఓల్డేజ్ లుక్‌లో కనిపించారు. దీంతో కోహ్లీని ఇలా చూడలేకపోతున్నామని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో ఆయన 50 ఏళ్లు పైబడిన వ్యక్తిలా కనిపిస్తున్నారని అంటున్నారు.
News August 8, 2025
సిట్ విచారణపై నాకు నమ్మకం లేదు: సంజయ్

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణపై తనకు నమ్మకం లేదని కేంద్రమంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ అన్నారు. దీనిపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ‘ఇదంతా టైమ్ పాస్ వ్యవహారంలా అనిపిస్తోంది. BRS హయాంలోనే నా ఫోన్‌ను ఎక్కువగా ట్యాప్ చేశారు. సిట్ చాలా రోజులుగా విచారణ చేస్తున్నా కేసీఆర్ కుటుంబంలో ఎవరినీ అరెస్టు చేయలేదు’ అని అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు సిట్ విచారణ కోసం బండి సంజయ్ బయల్దేరారు.