News August 8, 2025
భారత్, రష్యా, చైనా కలుస్తాయా?

US టారిఫ్స్‌కు వ్యతిరేకంగా భారత్, రష్యా, చైనా ఏకమయ్యే అవకాశం ఉందని వార్తలొస్తున్నాయి. రష్యా, బ్రెజిల్ అధ్యక్షులు పుతిన్, లులా భారత్‌కు రానున్నారు. మరోవైపు ప్రధాని మోదీ ఆరేళ్ల తర్వాత చైనాకు వెళ్లనున్నారు. అటు ఇండియాలోని చైనా రాయబారి అమెరికా సుంకాలపై విమర్శలు గుప్పించారు. WTO నియమాలను యూఎస్ ఉల్లంఘిస్తోందన్నారు. ఈ పరిణామాలన్నీ గమనిస్తే USపై ఉమ్మడి పోరాటానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది.
Similar News
News August 8, 2025
పాము కాటేస్తే వెంటనే ఇలా చేయండి..

వర్షాకాలంలో విష సర్పాలు జనావాసాల్లో సంచరిస్తుంటాయి. ఈక్రమంలో పాము కాట్లు జరిగే అవకాశం ఉండటంతో కేంద్రం ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. ‘పాము కాటేస్తే గాభరా పడకండి. ప్రభావిత ప్రాంతంలో బిగుతుగా ఉండే దుస్తులను తీసేయండి. కాటేసిన చోటు నుంచి కాస్తపై భాగంలో గుడ్డతో కట్టండి. కానీ రక్తప్రసరణ ఆగిపోకుండా చూసుకోండి. కాటు గాయాన్ని కోయడం లేదా పీల్చడం చేయవద్దు. వీలైనంత త్వరగా ఆస్పత్రికి వెళ్లండి’ అని తెలిపింది.
News August 8, 2025
ఇండియాలో సురక్షితమైన నగరాలు ఇవే!

Numbeo Safety Index mid-2025 ర్యాంకింగ్స్ ప్రకారం ప్రపంచంలో సురక్షిత దేశాల జాబితాలో భారత్ 67వ స్థానంలో నిలిచింది. మన దేశంలో మంగళూరు, వడోదర, అహ్మదాబాద్, సూరత్, జైపూర్, నవీ ముంబై, తిరువనంతపురం, చెన్నై, పుణే, చండీగఢ్ టాప్-10లో చోటు దక్కించుకున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్క సిటీకి కూడా చోటు దక్కలేదు. ప్రపంచంలో సురక్షితమైన నగరాల్లో అబుదాబి, దోహా, దుబాయ్, షార్జా, తైపీ టాప్-5లో ఉన్నాయి.
News August 8, 2025
VIRAL: తెల్లగడ్డంతో విరాట్ కోహ్లీ!

టెస్టులు, T20Iలకు రిటైర్మెంట్ ప్రకటించిన టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం లండన్‌లో కుటుంబంతో కలిసి ఉంటున్నారు. తాజాగా ఆయన దిగిన ఫొటో ఒకటి వైరలవుతోంది. అందులో కోహ్లీ మునుపెన్నడూ లేనంతగా నెరిసిన గడ్డం, మీసాలతో ఓల్డేజ్ లుక్‌లో కనిపించారు. దీంతో కోహ్లీని ఇలా చూడలేకపోతున్నామని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో ఆయన 50 ఏళ్లు పైబడిన వ్యక్తిలా కనిపిస్తున్నారని అంటున్నారు.