News March 31, 2024
RRR పోటీపై సందిగ్ధత.. క్యాడర్‌లోనూ క్లారిటీ మిస్!
MP రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలతో ప.గో జిల్లాలోని నర్సాపురం నియోజకవర్గం తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఇక్కడ BJP అభ్యర్థిగా శ్రీనివాసవర్మను అధిష్ఠానం ప్రకటించినప్పటికీ RRR మాత్రం తానే బరిలో ఉంటానని, ఇక్కడ MPగా కాకుంటే ప.గోలోనే MLAగానైనా పోటీ చేస్తానని చెబుతున్నారు. అటు BJP నేతలు వర్మనే పోటీలో ఉంటారని స్పష్టం చేశారు. దీంతో RRR వర్గంతో పాటు కూటమి క్యాడర్‌లోనూ క్లారిటీ లేకుండా పోయినట్లు తెలుస్తోంది.
Similar News
News November 23, 2024
పిఠాపురం ప్రజలకు గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం
పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీని ఏర్పాటు చేస్తూ సీఎస్ నీరభ్ కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి ఛైర్మన్‌గా కాకినాడ కలెక్టర్ వ్యవహరిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నియోజకవర్గ MLAగా పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలిచాక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని గతంలో చెప్పిన విషయం తెలిసిందే.
News November 23, 2024
తూ.గో: ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యేలు
పీ.యు.సీ. కమిటీ ఛైర్మన్‌గా ఎంపికైన కూన రవి కుమార్ మైన్స్ & జియాలజీ, ఎక్సైజ్ శాఖా మాత్యులు కొల్లు రవీంద్ర, రాష్ట్ర ఎస్టిమేట్ కమిటీ సభ్యులుగా ఎంపికైన ఏలూరి సాంబశివరావు, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణరెడ్డి ఇతర సభ్యులతో కలసి రాష్ట్ర ఎస్టిమేట్ కమిటీ చైర్మన్‌గా ఎన్నికైన సంధర్భంగా ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలియజేశారు.
News November 22, 2024
తూ.గో: CBI నుంచి అంటూ ఫేక్ కాల్
పి.గన్నవరానికి చెందిన ఓ వైద్యవిద్యార్థిని తండ్రికి గురువారం డిజిటల్ అరెస్ట్ కాల్ వచ్చింది. CBI నుంచి ఫోన్ చేస్తున్నామంటూ ఓ వ్యక్తి(పై ఫోటో) వాట్సాప్ కాల్ ద్వారా బెదిరించాడు. మీ కుమార్తెను అరెస్ట్ చేశామని, తమ అదుపులో ఉందని చెప్పాడు. అయితే కొద్దిసేపటి ముందే తన కుమార్తెతో మాట్లాడిన చంద్రశేఖర్ ఫేక్ కాల్ అని గుర్తించి పోలీసులను ఆశ్రయించాడు. ఇలాంటి ట్రాప్ కాల్స్ వలలో పడొద్దని పోలీసులు సూచిస్తున్నారు.