News August 8, 2025

రేప్ కేసులో పాక్ క్రికెటర్ అరెస్టు.. బెయిల్‌పై విడుదల

image

రేప్ కేసులో పాకిస్థాన్-A క్రికెటర్ హైదర్ అలీని ఇంగ్లండ్ మాంచెస్టర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంగ్లండ్-Aతో వన్డేలు ఆడేందుకు UK వచ్చినప్పుడు అతడు తనపై అత్యాచారం చేశాడని పాకిస్థాన్‌కు చెందిన యువతి ఫిర్యాదు చేసింది. AUG 3న అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు పాస్‌పోర్ట్ స్వాధీనం చేసుకుని అనంతరం బెయిల్‌పై విడుదల చేశారు. అటు విచారణ పూర్తయ్యే వరకు అలీని సస్పెండ్ చేస్తున్నట్లు పాక్ క్రికెట్ బోర్డు తెలిపింది.

Similar News

News August 8, 2025

పార్టీ అభివృద్ధికి మోదీ సూచనలు ఇచ్చారు: మాధవ్

image

AP: ఢిల్లీ పర్యటనకు వెళ్లిన BJP రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ప్రధాని మోదీని కలిశారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులను ఆయనకు వివరించారు. ‘రాష్ట్రంలో పార్టీ అభివృద్ధికి ప్రధాని సలహాలు, సూచనలు ఇచ్చారు. ట్రంప్ టారిఫ్‌ల వల్ల ఆక్వా రైతులు పడుతున్న ఇబ్బందులను ప్రధాని దృష్టికి తీసుకెళ్లా. ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తున్నామని మోదీ బదులిచ్చారు. హర్ ఘర్ తిరంగాను ప్రతి గ్రామంలో నిర్వహిస్తాం’ అని వెల్లడించారు.

News August 8, 2025

BREAKING: కాంతార మూవీ నటుడు మృతి

image

‘కాంతార’ చిత్రంలో నటించిన టి.ప్రభాకర్ కళ్యాణి గుండెపోటుతో మృతి చెందారు. కర్ణాటక ఉడిపి జిల్లాలోని హిరియాడ్కాలోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. కాంతార సినిమాలో మహాదేవ పాత్రలో ఆయన కనిపించారు. ఐదేళ్ల క్రితం ఆయనకు హార్ట్ ఆపరేషన్ జరిగింది. ప్రభాకర్‌కు భార్య, కుమారుడు ఉన్నారు. తొలుత నాటక రంగంలో ఉన్న ఆయన క్రమంగా సినిమాల్లోకి వచ్చారు.

News August 8, 2025

లంచ్ తర్వాత ఈ పనులు చేస్తున్నారా?

image

కొందరు మధ్యాహ్న భోజనం చేసిన వెంటనే కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. అవి ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘లంచ్ చేసిన వెంటనే నిద్రకు ఉపక్రమిస్తే జీర్ణక్రియ మందగిస్తుంది. దీంతో గ్యాస్, అజీర్తి సమస్యలు వస్తాయి. తిన్న వెంటనే స్నానం చేయకూడదు. అలాగే కూల్ వాటర్, జ్యూసులు కూడా తీసుకోకూడదు. వాకింగ్ చేయకూడదు. ముఖ్యంగా లంచ్ తర్వాత సిగరెట్ తాగడం ప్రమాదకరం’ అని చెబుతున్నారు.