News August 8, 2025
IPL: RRతో సంజూ కటీఫ్!

రాజస్థాన్ రాయల్స్ నుంచి సంజూ శాంసన్ తప్పుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. జూన్‌లోనే సంజూ ఈ విషయాన్ని <<17327950>>యాజమాన్యానికి<<>> చెప్పారని, కానీ వారు ఒప్పుకోలేదని ESPNcricinfo తెలిపింది. దీంతో ఈ వ్యవహారాన్ని కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు అప్పగించినట్లు తెలుస్తోంది. ఆయన ఒప్పుకుంటే సంజూను రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత సంజూను మరో ఫ్రాంచైజీ ఆటగాడితో ట్రేడ్ చేసుకుంటారు. అది సాధ్యం కాకపోతే సంజూ 2026లో వేలంలోకి వెళ్లనున్నారు.
Similar News
News August 8, 2025
హైదరాబాద్‌కు భారీ వర్షసూచన

TG: రానున్న రెండు గంటల్లో హైదరాబాద్‌లో భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించింది. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ, హైడ్రా సిబ్బంది అప్రమత్తమయ్యారు. మరోవైపు సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, భూపాలపల్లి, నిర్మల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
News August 8, 2025
మీ జన్ ధన్ ఖాతా KYC అప్‌డేట్ చేయించారా?

ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన బ్యాంకు ఖాతాలు తీసుకుని పదేళ్లు పూర్తయిన వారు రీ-కేవైసీ చేయించాలని RBI సూచించింది. దీని గడువు సెప్టెంబర్ 30తో ముగియనుంది. గ్రామాల్లో ఏర్పాటు చేసిన స్పెషల్ క్యాంపులకు వెళ్లి అడ్రస్, ఫోన్ నంబర్ వంటి వివరాలతో KYC అప్‌డేట్ చేయించుకోవచ్చు. లేదా మీరే ఆన్‌లైన్(మీ బ్యాంక్ వెబ్‌సైట్)లో చేసుకోవచ్చు. 2014లో ఈ స్కీమును ప్రారంభించగా, దేశంలో ప్రస్తుతం 55.9 కోట్ల ఖాతాలున్నాయి.
News August 8, 2025
పార్టీ అభివృద్ధికి మోదీ సూచనలు ఇచ్చారు: మాధవ్

AP: ఢిల్లీ పర్యటనకు వెళ్లిన BJP రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ప్రధాని మోదీని కలిశారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులను ఆయనకు వివరించారు. ‘రాష్ట్రంలో పార్టీ అభివృద్ధికి ప్రధాని సలహాలు, సూచనలు ఇచ్చారు. ట్రంప్ టారిఫ్‌ల వల్ల ఆక్వా రైతులు పడుతున్న ఇబ్బందులను ప్రధాని దృష్టికి తీసుకెళ్లా. ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తున్నామని మోదీ బదులిచ్చారు. హర్ ఘర్ తిరంగాను ప్రతి గ్రామంలో నిర్వహిస్తాం’ అని వెల్లడించారు.