News August 8, 2025
నేను చాలా ఎమోషనల్: రష్మిక

తాను చాలా ఎమోషనల్ పర్సన్ అని, భావోద్వేగాలను అందరి ముందు ప్రదర్శించనని హీరోయిన్ రష్మిక చెప్పారు. చాలా మంది తన దయాగుణాన్ని ఫేక్ అని అనుకోవడమే కారణమని చెప్పారు. ఎంత నిజాయితీగా ఉంటే అంత వ్యతిరేకత వస్తుందని, నెగిటివిటీ, ట్రోలింగ్‌ను ఎదుర్కోవడం చాలా కష్టమన్నారు. తన ప్రయాణంపై దృష్టి పెట్టి క్రమశిక్షణతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ బ్యూటీ మైసా, ది గర్ల్‌ఫ్రెండ్ చిత్రాల్లో నటిస్తున్నారు.
Similar News
News August 8, 2025
వాళ్ల పని ఫోన్లు వినడమే: బండి సంజయ్

TG: భార్యాభర్తల ఫోన్లు విన్న దుర్మార్గులు KCR కుటుంబ సభ్యులని బండి సంజయ్ విరుచుకుపడ్డారు. ‘గత BRS పాలనలో వారు చేసిన పని ఒక్కటే.. అందరి ఫోన్లూ వినడమే. జాబితాలో పేర్లున్న రేవంత్, కేసీఆర్ కూతురు, అల్లుడిని కూడా విచారణకు పిలవాలి’ అని ఆయన డిమాండ్ చేశారు. విచారణ చేస్తున్న సిట్ అధికారులు మంచోళ్లే కానీ, రేవంత్ సర్కార్‌పైనే తమకు నమ్మకం లేదన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు.
News August 8, 2025
నన్ను రిలీజ్ చేయండి: CSKకు అశ్విన్ రిక్వెస్ట్

సీఎస్కే బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ ఆ జట్టును వీడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. తనను రిలీజ్ చేయాలని సీఎస్కేను అశ్విన్ కోరినట్లు వార్తలు వస్తున్నాయి. 2026 వేలంలోకి పంపడం లేదా ట్రేడ్ చేయాలని ఆయన యాజమాన్యాన్ని అభ్యర్థించినట్లు సమాచారం. మరోవైపు సంజూ శాంసన్‌ను తీసుకోవాలంటే ఇద్దరు ప్లేయర్లను వదులుకోవాలని సీఎస్కేకు ఆర్ఆర్ కండీషన్ పెట్టినట్లు తెలుస్తోంది.
News August 8, 2025
వరలక్ష్మీ వ్రతం.. సాయంత్రం ఈ తప్పు చేయకండి!

వరలక్ష్మీ వ్రతం రోజు(శుక్రవారం) అమ్మవారికి ఉద్వాసన పలకకూడదని పండితులు చెబుతున్నారు. ‘వ్రతం రోజు భూశయనం చేస్తే మంచిది. కచ్చితంగా బ్రహ్మచర్యం పాటించాలి. చేతికి కట్టుకున్న తోరమును రాత్రంతా ఉంచుకోవాలి. శనివారం తెల్లవారుజామున స్నానానికి ముందు తోరము తీసేయాలి. అమ్మవారిని పంచోపచార విధానంలో పూజించాలి. ఏదైనా పండు నైవేద్యంగా పెట్టి హారతివ్వాలి. దుర్ముహూర్తం వెళ్లాకే అమ్మవారిని కదపాలి’ అని సూచిస్తున్నారు.