News August 8, 2025
VZM: పారపని చేస్తుండగా పిడుగు పడి మృతి

విజయనగరం జిల్లాలో విషాదం నెలకొంది. జామి మండలం అట్టాడ గ్రామంలో పిడుగు పడి సత్యనారాయణ (60) మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గ్రామ సమీపంలోని పార పని చేస్తుండగా పిడుగుపాటుకు గురయ్యాడని చెప్పారు. కుటుంబ పెద్ద చనిపోవడంతో ఆ ఇంట్లో విషాదఛాయలు అలముకున్నాయి. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు.
Similar News
News September 1, 2025
ప్రశాంతమైన జిల్లాగా పేరును నిలబెడదాం: కలెక్టర్

విజయనగరం జిల్లా చాలా ప్రశాంతమైనదని, ఆ పేరును నిలబెట్టుకునేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కలెక్టర్ అంబేద్కర్ కోరారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆడిటోరియంలో జిల్లా శాంతి కమిటీ సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఈ నెలలో వినాయక నిమజ్జనం, దసరా ఉత్సవాలు, మిలాద్ ఉన్ నబి పండగలు ఉన్న కారణంగా అవన్నీ ప్రశాంతమైన వాతావరణంలో జరిగేటట్లు చూడాలని కోరారు. కార్యక్రమంలో ఎస్పీ వకుల్ జిందల్ పాల్గొన్నారు.
News September 1, 2025
VZM: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 28 ఫిర్యాదులు

విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం SP వకుల్ జిందాల్ ఆధ్వర్యంలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నిర్వహించారు. కార్యక్రమంలో SP ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి, వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఫిర్యాదుల పట్ల సిబ్బంది సానుకూలంగా స్పందించాలని, చట్ట పరిధిలో తగిన చర్యలు తీసుకుని ప్రజలకు న్యాయం చేయాలని ఆయన చెప్పారు. వివిధ సమస్యలపై ప్రజల నుంచి మొత్తం 28 ఫిర్యాదులను స్వీకరించారు.
News September 1, 2025
ఆకతాయిల భరతం పట్టేందుకు ప్రత్యేకంగా శక్తి టీమ్స్: VZM SP

ఆకతాయిల భరతం పట్టేందుకు ప్రత్యేకంగా శక్తి టీమ్స్ పని చేస్తున్నాయని ఎస్పీ వకుల్ జిందల్ ఆదివారం తెలిపారు.
మహిళలపై జరుగుతున్న దాడులు, ఆకతాయిల వేధింపులను నియంత్రించేందుకు, మహిళలకు రక్షణగా నిలిచే చట్టాలు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘శక్తి’ యాప్ పట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు శక్తి టీమ్స్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఐదు బృందాలుగా 30 మంది నిత్యం పహారా కాస్తున్నారని పేర్కొన్నారు.


