News August 8, 2025

KGHలో లంచం లేనిదే పనవ్వదా?

image

KGHలో వైద్య సేవలపై ప్రజలకు రోజురోజుకీ నమ్మకం సన్నగిల్లుతోంది. ఈ విమర్శలకు Way2Newsలో ఈరోజు పబ్లిష్ అయిన ‘<<17338114>>చేతులే.. వీల్‌ ఛైర్<<>>’ అన్న వార్తకు వచ్చిన కామెంట్లే నిదర్శనం. ‘లంచం లేనిదే ఇక్కడ పనవ్వదని’, ‘రోగుల పట్ల దురుసుగా వ్యవహరిస్తారు’అని ఆరోపించారు. కార్పొరేట్ ఆసుపత్రుకు వెళ్లలేని నిరుపేదలు కొనఊపిరితో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఇక్కడికి వస్తారు. ఇప్పటికైనా సంబంధిత మంత్రి దృష్టి సారించాల్సి ఉంది.

Similar News

News August 8, 2025

ఏలూరు: యాసిడ్ మీద పడి మహిళ మృతి

image

ఏలూరు జాతీయ రహదారిపై తాళ్లమూడి వద్ద జరిగిన ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. యాసిడ్ లోడ్‌తో వెళ్తున్న ఆటో బోల్తా పడి, ఆ యాసిడ్ ద్విచక్రవాహనంపై వెళ్తున్న దంపతులపై పడింది. ఈ ఘటనలో భార్య అక్కడికక్కడే మృతి చెందగా, భర్త తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు. పెదపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News August 8, 2025

శ్రీకాకుళం: 11న పాత ఎలక్ట్రానిక్ పరికరాల వేలం పాట

image

శ్రీకాకుళం మండలం తండేవలస జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో పాత ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇతర సామాగ్రిని వేలం వేస్తున్నట్లు ఎస్పీ మహేశ్వర్ రెడ్డి తెలియజేశారు. ఆగస్టు 11వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు బహిరంగ వేలంపాట ఉంటుందని శుక్రవారం తెలిపారు. ఆసక్తి గలవారు స్టోర్ ఇన్‌ఛార్జ్ 9063477888, రిజర్వ్ ఇన్స్పెక్టర్ 6309990841 నెంబర్లలో సంప్రదించాలని చెప్పారు.

News August 8, 2025

పార్లమెంట్లో మాట్లాడిన వరంగల్ ఎంపీ కావ్య

image

తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో వైద్య, విద్య, ఆరోగ్య సదుపాయాలను మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించాలంటూ వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య పార్లమెంట్లో ప్రశ్నించారు. ప్రధానంగా గ్రామీణ మెడికల్ కళాశాలల్లో డాక్టర్లు, సిబ్బంది, అధ్యాపకుల నియామకాలు, ల్యాబ్స్, లైబ్రరీలు, హాస్టళ్లు, వైద్య పరికరాలు, డయాగ్నస్టిక్ టూల్స్ గ్రామీణ సేవలకు ప్రోత్సాహకాల వంటి అంశాలపై ఎంపీ వివరణ కోరారు.