News August 8, 2025
భారత్ నుంచి ఆర్డర్లు నిలిపివేసిన అమెజాన్?

ట్రంప్ టారిఫ్స్ దెబ్బతో భారత్ నుంచి స్టాక్ పంపించొద్దని తమ ఎగుమతిదారులకు యూఎస్ నుంచి మెయిల్స్, లెటర్స్ వచ్చినట్లు తెలుస్తోంది. అమెజాన్, వాల్‌మార్ట్, టార్గెట్, గ్యాప్ వంటి సంస్థలు ఆర్డర్లు నిలిపేయాలని సూచించినట్లు సమాచారం. తదుపరి అప్డేట్ అందేవరకూ ఎగుమతులను నిలిపేయాలని కోరినట్లు తెలుస్తోంది. కాగా ట్రంప్ భారత్‌పై 50 శాతం సుంకాలు విధించిన విషయం తెలిసిందే.
Similar News
News August 8, 2025
YS భాస్కర్‌రెడ్డి, శివశంకర్ రెడ్డికి నోటీసులు

AP: TDP నేత విశ్వనాథరెడ్డిని బెదిరించిన కేసులో YS భాస్కర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి పోలీసులు నోటీసులిచ్చారు. కడప పోలీసులు HYD వెళ్లి 41A నోటీసులు అందజేశారు. విశ్వనాథరెడ్డి ఇటీవలే బీటెక్ రవి సమక్షంలో TDPలో చేరారు. ఈ నేపథ్యంలో తనను భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి, MP అవినాశ్ PA, తదితరులు బెదిరించారని కాల్ డేటా సమర్పించారు. దాంతో కేసు నమోదైంది. వీళ్లిద్దరూ వివేకా హత్యకేసులోనూ నిందితులు.
News August 8, 2025
గిఫ్టులు, డబ్బులు రెడీనా బ్రదర్స్!

రేపే రాఖీ పండుగ. తెలుగు రాష్ట్రాల్లోని రాఖీ షాపులు కిటకిటలాడుతున్నాయి. అక్కాచెల్లెళ్లను సంతోషపరిచేందుకు సోదరులు గిఫ్టు షాపులు, ఏటీఎంల చుట్టూ తిరిగేస్తున్నారు. చెల్లెమ్మలు తమ కావాల్సినవి ఇండైరెక్ట్‌గా తెలిపేందుకు అన్నలకు ఇన్‌స్టా రీల్స్ షేర్ చేస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే.. తమ ప్రియమైన సోదరులకు రాఖీ కట్టేందుకు ఆడపడుచులు సొంతూళ్లకు బయల్దేరారు.
News August 8, 2025
మర్డర్ కేసులో కోటా వినుతకు బెయిల్

AP: డ్రైవర్ రాయుడు హత్య కేసులో శ్రీకాళహస్తి జనసేన పార్టీ బహిష్కృత నేత కోటా వినుతకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రతిరోజూ చెన్నైలోని C3 సెవెన్ వెల్స్ పీఎస్‌లో సంతకం చేయాలనే షరతుతో మద్రాస్ చీఫ్ సెషన్స్ కోర్టు బెయిల్ ఇచ్చింది. కాగా తన కారు డ్రైవర్‌ను కోటా వినుత భర్త చంద్రబాబుతో కలిసి చంపారనే ఆరోపణలతో చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం మద్రాస్ జైలుకు తరలించారు.