News August 8, 2025
AP న్యూస్ రౌండప్

* విశాఖ గ్యాస్ సిలిండర్ ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల నష్ట పరిహారం
* నెల్లూరు జిల్లా చెర్లోపల్లి గేటు సమీపంలో గంగా-కావేరీ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు
* తిరుపతిలో ముంతాజ్ హోటల్‌కు భూకేటాయింపులు రద్దు
* జిల్లా కేంద్రాల్లో టెక్నాలజీ సర్వీసెస్ కేంద్రాలు: మన్నవ మోహన్ కృష్ణ
* నేటి నుంచి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL) ప్రారంభం
Similar News
News August 8, 2025
ప్రభాస్ ‘ఫౌజీ’ రిలీజ్ డేట్ ఫిక్స్?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘ఫౌజీ’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని గుడ్ ఫ్రైడే సందర్భంగా 2026 APR 3న విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించినట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వస్తుందని టాక్. అలాగే పాటలు తప్ప మిగతా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ మూవీలో ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తున్నారు.
News August 8, 2025
YS భాస్కర్‌రెడ్డి, శివశంకర్ రెడ్డికి నోటీసులు

AP: TDP నేత విశ్వనాథరెడ్డిని బెదిరించిన కేసులో YS భాస్కర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి పోలీసులు నోటీసులిచ్చారు. కడప పోలీసులు HYD వెళ్లి 41A నోటీసులు అందజేశారు. విశ్వనాథరెడ్డి ఇటీవలే బీటెక్ రవి సమక్షంలో TDPలో చేరారు. ఈ నేపథ్యంలో తనను భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి, MP అవినాశ్ PA, తదితరులు బెదిరించారని కాల్ డేటా సమర్పించారు. దాంతో కేసు నమోదైంది. వీళ్లిద్దరూ వివేకా హత్యకేసులోనూ నిందితులు.
News August 8, 2025
గిఫ్టులు, డబ్బులు రెడీనా బ్రదర్స్!

రేపే రాఖీ పండుగ. తెలుగు రాష్ట్రాల్లోని రాఖీ షాపులు కిటకిటలాడుతున్నాయి. అక్కాచెల్లెళ్లను సంతోషపరిచేందుకు సోదరులు గిఫ్టు షాపులు, ఏటీఎంల చుట్టూ తిరిగేస్తున్నారు. చెల్లెమ్మలు తమ కావాల్సినవి ఇండైరెక్ట్‌గా తెలిపేందుకు అన్నలకు ఇన్‌స్టా రీల్స్ షేర్ చేస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే.. తమ ప్రియమైన సోదరులకు రాఖీ కట్టేందుకు ఆడపడుచులు సొంతూళ్లకు బయల్దేరారు.