News August 8, 2025
ఇండియాలో సురక్షితమైన నగరాలు ఇవే!

Numbeo Safety Index mid-2025 ర్యాంకింగ్స్ ప్రకారం ప్రపంచంలో సురక్షిత దేశాల జాబితాలో భారత్ 67వ స్థానంలో నిలిచింది. మన దేశంలో మంగళూరు, వడోదర, అహ్మదాబాద్, సూరత్, జైపూర్, నవీ ముంబై, తిరువనంతపురం, చెన్నై, పుణే, చండీగఢ్ టాప్-10లో చోటు దక్కించుకున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్క సిటీకి కూడా చోటు దక్కలేదు. ప్రపంచంలో సురక్షితమైన నగరాల్లో అబుదాబి, దోహా, దుబాయ్, షార్జా, తైపీ టాప్-5లో ఉన్నాయి.
Similar News
News August 8, 2025
చంద్రబాబు ఆటలో సునీత కీలుబొమ్మ: మేరుగు

AP: సీఎం చంద్రబాబు ఆటలో వైఎస్ సునీత ఓ కీలుబొమ్మ అని వైసీపీ నేత మేరుగు నాగార్జున ఆరోపించారు. తన తండ్రిని ఓడించినవారికి ఆమె ఎలా మద్దతిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ‘కడపలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా సునీత తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అవినాశ్ రెడ్డిని బలిపశువును చేస్తున్నారు. వివేకా హత్య కేసును వాడుకుని లబ్ధి పొందాలని చూస్తున్నారు. ఎవరి ప్రోద్భలంతో సునీత ఇదంతా చేస్తున్నారు?’ అంటూ ఆయన ప్రశ్నించారు.
News August 8, 2025
ఓ స్టార్ హీరో నాపై కేకలు వేశాడు: తమన్నా

మిల్కి బ్యూటీ తమన్నా కెరీర్ ఆరంభంలో తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఓ స్టార్ హీరో తనను అవమానించారని, అరుస్తూ నోటికొచ్చినట్లు మాట్లాడారని ఆమె చెప్పారు. అసౌకర్యంగా ఫీలయ్యే సన్నివేశంలో నటించనని చెప్పినందుకు తనపై కోప్పడినట్లు తెలిపారు. ఆ తర్వాత వచ్చి క్షమాపణ చెప్పారని పేర్కొన్నారు. అయితే ఆ హీరో ఎవరనేది మాత్రం తమన్నా వెల్లడించలేదు.
News August 8, 2025
పండగ వేళ పెరిగిన ఆర్టీసీ ఛార్జీలు!

TG: రాఖీ పండగ వేళ ప్రత్యేక బస్సుల్లో RTC 30% వరకు ఛార్జీలు పెంచింది. అయితే పండగల సీజన్లో టికెట్ల ధరలు పెంచేందుకు అనుమతి ఉందని RTC అధికారులు చెబుతున్నారు. ఇద్దరు వ్యక్తులు ఇవాళ మహబూబాబాద్(D) తొర్రూర్ వెళ్లేందుకు HYD ఉప్పల్‌లో ఎక్స్‌ప్రెస్ బస్సు ఎక్కారు. టికెట్ ఒకరికి రూ.220 అయితే రూ.330(ఇద్దరికి రూ.660) వసూలు చేశారని వాపోయారు. మహిళలకు ఫ్రీ బస్సు కల్పించి పురుషులపై ఆ భారం మోపుతున్నారని మండిపడ్డారు.