News March 31, 2024
పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గిస్తాం: లోకేశ్

AP: తాము అధికారంలోకి రాగానే ఇంటి పన్ను, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ హామీ ఇచ్చారు. పాత ఇసుక విధానాన్ని తీసుకొస్తామని, మైనింగ్ విభాగంపై విచారణ కమిటీ వేస్తామని చెప్పారు. వ్యవసాయ ఆధారిత ఉద్యోగులకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిందని ఆరోపించారు.
Similar News
News March 13, 2026
కందిలో ఆకుగూడు పురుగు – నివారణకు సూచనలు

కంది పంట ఎదుగుదల దశలో ఎక్కువగా, ఒక్కోసారి పూత దశలో కూడా ఆకుగూడు పురుగు ఎక్కువగా ఆశిస్తుంది. ఈ పురుగు లార్వాలు కంది మొక్కల చిగురు ఆకులను గూడుగా చేసి, లోపల ఉండి ఆకులను, పువ్వులను, లేత కాయలను కూడా తొలిచి తింటాయి. ఈ పురుగు నివారణకు లీటరు నీటిలో క్వినాల్‌ఫాస్ 25% ఇ.సి. 2.0 మి.లీ. (లేదా) మోనోక్రోటోఫాస్ 36% యస్.యల్ 1.6 మి.లీ. కలిపి పంటపై పిచికారీ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
News March 13, 2026
BHELలో 47 పోస్టులు.. అప్లై చేశారా?

ఝాన్సీలోని భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(BHEL) 47అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. BE/BTech, డిప్లొమా, ఐటీఐ, ఇంటర్ అర్హతగల అభ్యర్థులు మార్చి 15 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 27ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. వెబ్‌సైట్: https://jhs.bhel.com
News March 13, 2026
గ్యాస్ దొరకట్లేదా.. ఈ నంబర్‌కు కాల్ చేయండి

TG: గ్యాస్ లభ్యతపై ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ‘1967’ అనే టోల్ ఫ్రీ నంబర్‌ను తీసుకొచ్చింది. LPG సిలిండర్ లభ్యతలో సమస్యలు, వీటిని అక్రమంగా కమర్షియల్ యూజ్ చేస్తున్నా ఈ నంబర్‌కు కాల్ చేసి చెప్పొచ్చని తెలిపింది. పౌర సరఫరాలకు సంబంధించి ఏ ఇతర సమస్యలు ఉన్నా దీనిని సంప్రదించొచ్చని పేర్కొంది. కాగా డొమెస్టిక్ సిలిండర్ల దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.


