News August 8, 2025
సోంపేట: అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

సోంపేట మండలం బెంకిలి గ్రామానికి చెందిన పూనే సీతమ్మ (65) మృతదేహం సాదు మెట్ట వద్ద ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్ట్‌మార్టం నిమిత్తం సోంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనకు గల కారాణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ లోవరాజు తెలిపారు.
Similar News
News August 9, 2025
జలుమూరు: ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ వేసిన రాజశేఖర్

జలుమూరు మండలం శ్రీముఖలింగం ఆలయ ప్రధాన అర్చకులు నాయుడుగారి రాజశేఖర్ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఢిల్లీలోని ఎన్నికల కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. రాజ్యసభ సెక్రటరీ జనరల్ పిసి మోడీ సమక్షంలో నామినేషన్ వేశానని శుక్రవారం ప్రకటనలో తెలిపారు. గతంలో ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీగా( 2019, 2024) సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంటుకు పోటీ చేయడం జరిగిందన్నారు. 2022లో రాష్ట్రపతి పదవికి నామినేషన్ వేయడం జరిగిందన్నారు.
News August 8, 2025
జలుమూరు: ఉప రాష్ట్రపతికి నామినేషన్ వేసిన రాజశేఖర్

జలుమూరు మండలం శ్రీముఖలింగం ఆలయ ప్రధాన అర్చకులు నాయుడుగారి రాజశేఖర్ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఢిల్లీలోని ఎన్నికల కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. రాజ్యసభ సెక్రటరీ జనరల్ పిసి మోడీ సమక్షంలో నామినేషన్ వేశానని శుక్రవారం ప్రకటనలో తెలిపారు. గతంలో ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీగా( 2019, 2024) సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంటుకు పోటీ చేయడం జరిగిందన్నారు. 2022లో రాష్ట్రపతి పదవికి నామినేషన్ వేయడం జరిగిందన్నారు.
News August 8, 2025
బంగారు కుటుంబాలకు అండగా ఉంటాం: వైద్యులు

జిల్లాలోని బంగారు కుటుంబాలకు వైద్యులు అండగా నిలుస్తామన్నారు. ఈ మేరకు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌ను శుక్రవారం వివిధ రంగాలకు చెందిన 85 మంది శ్రీకాకుళం కలెక్టరేట్‌లో కలిశారు. అధికారులు గుర్తించిన 2,580 కుటుంబాలకు అండగా నిలుస్తామని కలెక్టర్‌కు మాటిచ్చారు. రిమ్స్ డీసిహెచ్ఎస్ కళ్యాణ్ చక్రవర్తితో పాటు, పలువురు వైద్యులు ఉన్నారు.