News August 8, 2025

Zach Vukusic: 18 ఏళ్లకే కెప్టెన్

image

క్రొయేషియాకు చెందిన జాక్ గ్జేవియర్ మిక్లీ వుకుసిక్ (17Y 312D) ఆ దేశ క్రికెట్ జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యారు. దీంతో 18 ఏళ్లకే అంతర్జాతీయ జట్టుకు కెప్టెన్ అయిన తొలి ఆటగాడిగా వుకుసిక్ చరిత్ర సృష్టించారు. ఇప్పటివరకు ఆయన 6 T20లే ఆడటం గమనార్హం. జాక్ తర్వాత నోమన్ అంజాద్ (18Y 24D), కార్ల్ హర్ట్‌మన్లెస్లే (18Y 276D), ఎర్డెన్ బుల్గాన్(18Y 324D), డికుబ్విమానా (19Y 327D) పిన్న వయసు కెప్టెన్లుగా చేశారు.

Similar News

News August 8, 2025

రోడ్డు ప్రమాద బాధితులకు రూ.1.5లక్షల తక్షణ సాయం!

image

రోడ్డు ప్రమాదాల్లో బాధితులకు గోల్డెన్ అవర్‌లో తక్షణ చికిత్స అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొత్త పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీని ప్రకారం రోడ్డు ప్రమాద బాధితులకు రూ.1.5లక్షల వరకు నగదు రహిత చికిత్సను అందిస్తారు. ఈ చికిత్స గరిష్ఠంగా 7 రోజుల వరకు వర్తిస్తుంది. మోటార్ వాహనం వల్ల రోడ్డు ప్రమాదానికి గురైన ఎవరైనా ఈ పథకానికి అర్హులే. SHARE IT

News August 8, 2025

బండి బహిరంగ క్షమాపణ చెప్పకపోతే కోర్టుకు లాగుతా: KTR

image

TG: ఫోన్ ట్యాపింగ్ అంశంలో బండి సంజయ్ చేసిన <<17342231>>వ్యాఖ్యలపై<<>> మాజీ మంత్రి KTR ఫైర్ అయ్యారు. ‘సంజయ్ స్టేట్‌మెంట్స్ హద్దు మీరాయి. హోంశాఖ మంత్రి అయినా ఇంటెలిజెన్స్ ఎలా పనిచేస్తుందన్న ఇంగిత జ్ఞానం లేదని అర్థమైంది. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు నిరూపించాలని ఆయనకు సవాల్ విసురుతున్నా. 48 గంటల్లో తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణ చెప్పకపోతే లీగల్ నోటీసులు పంపి కోర్టుకు లాగుతా’ అన్నారు.

News August 8, 2025

ప్రధాని మోదీకి చైనా స్వాగతం

image

ఈ నెల 31, సెప్టెంబర్ 1 తేదీల్లో జరగబోయే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(SCO)లో పాల్గొనేందుకు వెళ్లనున్న భారత PM మోదీకి చైనా స్వాగతం పలికింది. కాగా ఏడేళ్ల తర్వాత మోదీ చైనాలో పర్యటించనున్నారు. చివరిసారి 2018లో అక్కడికి వెళ్లారు. గల్వాన్ లోయలో భారత్, చైనా సైన్యం ఘర్షణల తర్వాత ఇరు దేశాల సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వీటిని పునరుద్ధరించేందుకు ఇరు దేశాలు ప్రయత్నిస్తున్నాయి.