News August 8, 2025
IIT, NIT ఇంజినీర్ల సహకారం తీసుకోనున్న GHMC

హైదరాబాద్ సిటీ ఇన్నొవేటివ్ అండ్ ట్రాన్స్ ఫర్మేటివ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (H-CITI), స్టాటజిక్ నాలా డెవలప్‌మెంట్ ప్రోగ్రాం (SNDP) పనులకు GHMC అధికారులు IIT, NIT ఇంజినీర్ల సహకారం తీసుకోనున్నారు. ఇటీవల జరిగిన సమీక్ష సమావేశంలో నిర్ణయించారు. వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించి ఇంజినీరింగ్ మేధస్సును ఈ ప్రాజెక్టులకు ఉపయోగించుకోవాలని GHMC భావిస్తోంది.
Similar News
News September 14, 2025
గచ్చిబౌలిలో గోడ కూలి ఒకరు మృతి.. నలుగురికి గాయాలు

గచ్చిబౌలి పీఎస్ పరిధిలోని వట్టినాగులపల్లిలో ప్రమాదం జరిగింది. గోడ కూలి ఒకరు మృతి చెందగా నలుగురికి గాయాలయ్యాయి. స్థానికంగా కొత్తగా నిర్మిస్తున్న నూతన కన్వెన్షన్ సెంటర్‌కి చెందిన ప్రహరీ కూలి అక్కడే పని చేస్తున్న కూలీలపై పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News September 14, 2025
HYD: భాయ్.. ర్యాలీలో మా సేవ మీ కోసం!

పాతబస్తీలో మిలాద్ ఉన్ నబీ ఉత్సవాలు మిరాజ్ ఖాన్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. బండ్లగూడ అధ్యక్షుడు భరత్‌కుమార్ ముస్లిం సోదరుల కోసం మంచినీటి బాటిళ్లను పంపిణీ చేశారు. ఈ వేడుకల్లో ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమానికి మరింత శోభను తీసుకొచ్చారు. మత సామరస్యం, సేవా దృక్పథానికి ప్రతీకగా నిలిచిన ఈ కార్యక్రమాన్ని స్థానిక ప్రజలు ప్రశంసించారు.
News September 14, 2025
HYD: హనీ ట్రాప్‌లో యోగా గురువు

చేవెళ్లలో యోగా గురువు రంగారెడ్డిని హనీ ట్రాప్ చేశారు. ఆయనకు ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు తెలిసి ఆశ్రమంలో చేరిన ఇద్దరు మహిళలు సన్నిహితంగా ఉంటూ వీడియోలు తీశారు. ఇవి ప్రధాన నిందితుడు అమర్‌కు చేరగా.. అతడు బ్లాక్ మెయిల్‌కు పాల్పడ్డాడు. ఇప్పటికే రంగారెడ్డి నుంచి రూ. 50 లక్షలు వసూలు చేశారు. మరో రూ.2 కోట్లు కావాలని వేధించడంతో బాధితుడు గోల్కొండ PSలో ఫిర్యాదు చేయగా హనీ ట్రాప్ గ్యాంగ్‌ను అరెస్ట్ చేశారు.