News August 8, 2025

హైదరాబాద్‌కు భారీ వర్షసూచన

image

TG: రానున్న రెండు గంటల్లో హైదరాబాద్‌లో భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించింది. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ, హైడ్రా సిబ్బంది అప్రమత్తమయ్యారు. మరోవైపు సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, భూపాలపల్లి, నిర్మల్‌ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

Similar News

News August 8, 2025

సినీ ముచ్చట్లు

image

*యూట్యూబ్‌ని షేక్ చేస్తున్న జాన్వీ కపూర్ ‘పరమ్ సుందరి’ మూవీ రెయిన్ సాంగ్
*నాని ‘ప్యారడైజ్’ మూవీ కొత్త పోస్టర్ రిలీజ్
*ఆగస్టు 14న రిలీజవుతున్న కూలీ చిత్రంలో ‘శివ’ 4K రీరిలీజ్ ట్రైలర్
*తమిళనాడు వేలంకన్ని చర్చి, నాగూర్ దర్గాలు సందర్శించిన హీరోయిన్ శోభిత

News August 8, 2025

ట్విటర్ టిల్లు సిగ్గు పడాలి: బండి సంజయ్

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో KTR, బండి సంజయ్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. KTR విసిరిన <<17344505>>సవాల్‌పై<<>> తాజాగా బండి ఘాటుగా స్పందించారు. ‘చట్టవిరుద్ధమైన పనులు చేసి లీగల్ నోటీసుల గురించి మాట్లాడటానికి ట్విటర్ టిల్లు సిగ్గుపడాలి. తన ఫోన్ కూడా ట్యాప్ అయిందని నీ సొంత సోదరే ఆరోపించారు. రాఖీ వేళ ఆమెను ఎదుర్కోలేక పారిపోతున్నావు. నాకు ఇచ్చిన 48 గంటల సమయంలో మరిన్ని నీ చీకటి రహస్యాలు బయటపెడతా’ అని హెచ్చరించారు.

News August 8, 2025

రానున్న 2గంటల్లో వర్షం

image

TG: హైదరాబాద్‌లో రానున్న 2 గంటల్లో వర్షం పడుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎల్బీ నగర్, సరూర్ నగర్, సైదాబాద్, చార్మినార్, మలక్ పేట్, మెహదీపట్నం, నాంపల్లి, ఖైరతాబాద్ ప్రాంతాల్లో వర్షాలకు ఆస్కారం ఉందని చెబుతున్నారు. ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, ములుగు తదితర జిల్లాల్లోనూ వర్షాలకు ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.