News August 8, 2025

ట్రంప్‌ను ఎలా డీల్ చేయాలో మోదీకి నేర్పుతా: నెతన్యాహు

image

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఎలా డీల్ చేయాలో భారత ప్రధాని మోదీకి తాను చెబుతానని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అన్నారు. వీరిద్దరూ తన స్నేహితులే కాబట్టి ఈ చొరవ తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇందుకుగానూ త్వరలోనే తాను భారత్‌లో పర్యటిస్తానని తెలిపారు. భారత్-అమెరికా స్నేహబంధం గట్టిదని, టారిఫ్స్‌ అంశంపై తాను జోక్యం చేసుకుంటానని చెప్పారు.

Similar News

News January 23, 2026

బందీలుగా ఉన్న మత్స్యకారులకు ఈనెల 29న విముక్తి

image

AP: బంగ్లాదేశ్ జైల్లో బందీలుగా ఉన్న 23 మంది భారతీయ మత్స్యకారులు ఈ నెల 29న విడుదల కానున్నారు. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్ అధికారికంగా ప్రకటించింది. విడుదలయ్యే వారిలో విజయనగరం జిల్లాకు చెందిన 9 మంది, పశ్చిమ బెంగాల్‌కు చెందిన 14 మంది ఉన్నారు. గత అక్టోబర్ 22న విశాఖ హార్బర్ నుంచి వేటకు వెళ్లి పొరపాటున బంగ్లాదేశ్ జలాల్లోకి ప్రవేశించడంతో వీరు అరెస్టయ్యారు.

News January 23, 2026

బ్రెజిల్‌తో భాగస్వామ్యం కొత్త శిఖరాలకు: మోదీ

image

బ్రెజిల్ అధ్యక్షుడు లూలాతో PM మోదీ ఫోన్‌లో మాట్లాడారు. ‘కొత్త శిఖరాలను అధిరోహించడానికి సిద్ధంగా ఉన్న IND-బ్రెజిల్ భాగస్వామ్యంపై సమీక్షించాం. గ్లోబల్ సౌత్ ఉమ్మడి ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లడానికి మా సహకారం చాలా ముఖ్యం’ అని ట్వీట్ చేశారు. ‘FEB 19-21 మధ్య నా ఢిల్లీ పర్యటనపై డిస్కస్ చేశాం. భౌగోళిక పరిస్థితులు, గాజాలో శాంతి స్థాపన, ప్రజాస్వామ్యం వంటి అంశాలపై చర్చించాం’ అని లూలా పేర్కొన్నారు.

News January 23, 2026

జనవరి 23: చరిత్రలో ఈరోజు

image

1897: స్వాతంత్ర్య సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ జననం
1911: హైదరాబాద్ తొలి మహిళా మేయర్ రాణీ కుముదినీ దేవి జననం
1915: ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత ఆర్థర్ లూయీస్ జననం
1926: శివసేన పార్టీ వ్యవస్థాపకుడైన బాల్ ఠాక్రే జననం
2015: హాస్యనటుడు ఎం.ఎస్. నారాయణ మరణం (ఫొటోలో)