News August 8, 2025
చివరికి జడ్జి ఫోన్ కాల్స్ కూడా విన్నారు: బండి

TG: KCR కొడుకు తన స్వలాభం కోసం ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డాడని బండి సంజయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘రాజకీయ నేతలు, వ్యాపారులు, అధికారులు, ఉస్మానియా ప్రొఫెసర్లతో పాటు చివరికి TGPSC పేపర్ లీకేజీ కేసును విచారిస్తున్న జడ్జి ఫోన్ కాల్స్ కూడా విన్నారు. ప్రభాకర్ రావు అనేవాడు లఫంగి. ఆయనను ఉరి తీయాలి. ఈ కేసులో ఇన్ని ఆధారాలు ఉన్నా KCR కుటుంబాన్ని రేవంత్ సర్కార్ ఎందుకు అరెస్ట్ చేయడం లేదు’ అని ప్రశ్నించారు.
Similar News
News February 3, 2026
మహిళలూ.. ఈ లక్షణాలున్నాయా? జాగ్రత్త

క్యాన్సర్ లక్షణాలు అన్నిసార్లూ బయటకు కనిపించవు. ముఖ్యంగా మహిళల్లో కొన్ని క్యాన్సర్లు నిశ్శబ్ధంగా శరీరంలో వ్యాపిస్తాయంటున్నారు నిపుణులు. చాలా క్యాన్సర్లను ప్రారంభదశలో గుర్తించడం కష్టమని చెబుతున్నారు. అందుకే మహిళల్లో అసాధారణ వాపు, దీర్ఘకాల అలసట, కారణం లేకుండా బరువు తగ్గడం, చర్మంపై మార్పులు, అసాధారణ రక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
News February 3, 2026
గతేడాది 19 విమాన ప్రమాదాలు

గతేడాది దేశంలో 19 విమాన ప్రమాదాలు జరిగినట్లు కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మొహోల్ రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. ఈ ఘటనలపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) దర్యాప్తు చేసిందని వెల్లడించారు. వీటికి సంబంధించిన నివేదికలను AAIB వెబ్‌సైట్‌లో ప్రచురించామని ఆయన తెలిపారు.
News February 3, 2026
ఎల్‌ఐసీ FPOకి రంగం సిద్ధం

వచ్చే FYలో LICలో మలి విడత పబ్లిక్ ఆఫరింగ్ (FPO)కు కేంద్రం సిద్ధమవుతోంది. సెబీ నిబంధనల ప్రకారం 2027 నాటికి పబ్లిక్ వాటాను 10%కి పెంచాల్సి ఉంది. దీంతో ప్రస్తుతం ఉన్న 96.5% ప్రభుత్వ వాటాలో మరో 6.5% తగ్గించనుంది. మార్కెట్ పరిస్థితులు అనుకూలిస్తేనే దీనికి అడుగులు పడతాయని ఆర్థిక సేవల శాఖ తెలిపింది. 2022లో IPOతో రూ.21,000 కోట్లు సమకూరాయి. ప్రస్తుతం సంస్థ మార్కెట్ విలువ రూ.5.08 లక్షల కోట్లుగా ఉంది.


