News August 8, 2025
నన్ను రిలీజ్ చేయండి: CSKకు అశ్విన్ రిక్వెస్ట్

సీఎస్కే బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ ఆ జట్టును వీడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. తనను రిలీజ్ చేయాలని సీఎస్కేను అశ్విన్ కోరినట్లు వార్తలు వస్తున్నాయి. 2026 వేలంలోకి పంపడం లేదా ట్రేడ్ చేయాలని ఆయన యాజమాన్యాన్ని అభ్యర్థించినట్లు సమాచారం. మరోవైపు సంజూ శాంసన్‌ను తీసుకోవాలంటే ఇద్దరు ప్లేయర్లను వదులుకోవాలని సీఎస్కేకు ఆర్ఆర్ కండీషన్ పెట్టినట్లు తెలుస్తోంది.
Similar News
News August 8, 2025
అట్టహాసంగా ప్రారంభమైన APL సీజన్- 4

AP: వైజాగ్ వేదికగా ‘ఆంధ్రా ప్రీమియర్ లీగ్’ సీజన్ 4 అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, హీరో వెంకటేశ్ హాజరయ్యారు. వారికి ACA అధ్యక్షుడు MP కేశినేని చిన్ని స్వాగతం పలికారు. నటి ప్రగ్యా జైస్వాల్ డాన్స్, మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ ప్రదర్శన అలరించింది. లేజర్, డ్రోన్ షోస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కాకినాడ కింగ్స్, అమరావతి రాయల్స్ మధ్య తొలిమ్యాచ్ జరుగుతోంది.
News August 8, 2025
సినీ ముచ్చట్లు

*యూట్యూబ్‌ని షేక్ చేస్తున్న జాన్వీ కపూర్ ‘పరమ్ సుందరి’ మూవీ రెయిన్ సాంగ్
*నాని ‘ప్యారడైజ్’ మూవీ కొత్త పోస్టర్ రిలీజ్
*ఆగస్టు 14న రిలీజవుతున్న కూలీ చిత్రంలో ‘శివ’ 4K రీరిలీజ్ ట్రైలర్
*తమిళనాడు వేలంకన్ని చర్చి, నాగూర్ దర్గాలు సందర్శించిన హీరోయిన్ శోభిత
News August 8, 2025
ట్విటర్ టిల్లు సిగ్గు పడాలి: బండి సంజయ్

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో KTR, బండి సంజయ్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. KTR విసిరిన <<17344505>>సవాల్‌పై<<>> తాజాగా బండి ఘాటుగా స్పందించారు. ‘చట్టవిరుద్ధమైన పనులు చేసి లీగల్ నోటీసుల గురించి మాట్లాడటానికి ట్విటర్ టిల్లు సిగ్గుపడాలి. తన ఫోన్ కూడా ట్యాప్ అయిందని నీ సొంత సోదరే ఆరోపించారు. రాఖీ వేళ ఆమెను ఎదుర్కోలేక పారిపోతున్నావు. నాకు ఇచ్చిన 48 గంటల సమయంలో మరిన్ని నీ చీకటి రహస్యాలు బయటపెడతా’ అని హెచ్చరించారు.