News August 8, 2025

గిఫ్టులు, డబ్బులు రెడీనా బ్రదర్స్!

image

రేపే రాఖీ పండుగ. తెలుగు రాష్ట్రాల్లోని రాఖీ షాపులు కిటకిటలాడుతున్నాయి. అక్కాచెల్లెళ్లను సంతోషపరిచేందుకు సోదరులు గిఫ్టు షాపులు, ఏటీఎంల చుట్టూ తిరిగేస్తున్నారు. చెల్లెమ్మలు తమ కావాల్సినవి ఇండైరెక్ట్‌గా తెలిపేందుకు అన్నలకు ఇన్‌స్టా రీల్స్‌ షేర్ చేస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే.. తమ ప్రియమైన సోదరులకు రాఖీ కట్టేందుకు ఆడపడుచులు సొంతూళ్లకు బయల్దేరారు.

Similar News

News August 9, 2025

P4లో వెనుకబడ్డ జిల్లాలు.. సీఎం అక్షింతలు తప్పవా?

image

AP: పేదరిక నిర్మూలనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం P4 కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోంది. AUG 15 నాటికి 80% పేద కుటుంబాలకు సాయం అందించాలని CM చంద్రబాబు కలెక్టర్లకు సూచించారు. కాకినాడ, గుంటూరు జిల్లాలు 95% లక్ష్యాన్ని చేరుకోగా.. నెల్లూరు, విశాఖపట్నం జిల్లాల్లో కనీసం 50% కూడా మార్గదర్శులు దత్తత తీసుకోలేదు. ఈ జిల్లాల అధికారులకు CM చేతుల్లో అక్షింతలు తప్పవని చర్చ నడుస్తోంది.

News August 9, 2025

మీ నిద్రని ట్రాక్ చేస్తున్నారా?

image

స్లీప్ ట్రాకింగ్‌తో ఎన్నో ప్రయోజనాలుంటాయని వైద్యులు చెబుతున్నారు. ‘స్లీప్ ట్రాకింగ్‌తో మీ నిద్ర, శరీరం స్పందిస్తున్న తీరు తెలుస్తుంది. ఎంతసేపు నిద్రపోయారు, ఎంత క్వాలిటీ నిద్ర పోయారో తెలుసుకోవచ్చు. ఈ రికార్డ్స్‌‌తో చికిత్సలేని కొన్ని నిద్ర సమస్యలను ముందే గుర్తించవచ్చు. దాంతో మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు’ అని సూచిస్తున్నారు. స్మార్ట్ వాచ్, హెల్త్ రింగ్, AI పరికరాలతో మీ నిద్రని ట్రాక్ చేసుకోవచ్చు.

News August 9, 2025

SSC CGL పరీక్షలు వాయిదా

image

ఆగస్టు 13-30 వరకు జరగాల్సిన కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్(CGL) పరీక్షలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాయిదా వేసింది. ఫేజ్-13లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు SSC ప్రకటించింది. సెప్టెంబర్ మొదటి వారం నుంచి పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించింది. ఆ తేదీలు త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొంది. 14,582 గ్రూప్ B, C పోస్టులకు గతంలో SSC నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే.