News August 8, 2025
ఏలూరు: యాసిడ్ మీద పడి మహిళ మృతి

ఏలూరు జాతీయ రహదారిపై తాళ్లమూడి వద్ద జరిగిన ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. యాసిడ్ లోడ్‌తో వెళ్తున్న ఆటో బోల్తా పడి, ఆ యాసిడ్ ద్విచక్రవాహనంపై వెళ్తున్న దంపతులపై పడింది. ఈ ఘటనలో భార్య అక్కడికక్కడే మృతి చెందగా, భర్త తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు. పెదపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News August 9, 2025
P4లో వెనుకబడ్డ జిల్లాలు.. సీఎం అక్షింతలు తప్పవా?

AP: పేదరిక నిర్మూలనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం P4 కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోంది. AUG 15 నాటికి 80% పేద కుటుంబాలకు సాయం అందించాలని CM చంద్రబాబు కలెక్టర్లకు సూచించారు. కాకినాడ, గుంటూరు జిల్లాలు 95% లక్ష్యాన్ని చేరుకోగా.. నెల్లూరు, విశాఖపట్నం జిల్లాల్లో కనీసం 50% కూడా మార్గదర్శులు దత్తత తీసుకోలేదు. ఈ జిల్లాల అధికారులకు CM చేతుల్లో అక్షింతలు తప్పవని చర్చ నడుస్తోంది.
News August 9, 2025
నిర్మల్ జిల్లాలో ఘనంగా వరలక్ష్మీ వ్రతం పూజలు

నిర్మల్ జిల్లా వ్యాప్తంగా వరలక్ష్మీ పూజలను ఈరోజు ఘనంగా నిర్వహించారు. శ్రావణమాసంలో వచ్చే ఈ వరలక్ష్మీ వ్రతాన్ని మహిళలు ఎంతో నిష్ఠగా చేసుకున్నారు. మహాలక్ష్మి అమ్మవారిని శాస్త్రీయ పద్ధతిలో పూలతో అలంకరించి పూజలు చేశారు. పూజల అనంతరం ఒకరికొకరు వాయనాలు ఇచ్చిపుచ్చుకున్నారు. కుటుంబాల్లో సుఖశాంతులు, అష్టైశ్వర్యాలు ఉండాలని మహిళలు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.
News August 9, 2025
కార్వేటి నగరంలో అంగరంగ వైభవంగా తెప్పోత్సవం

కార్వేటి నగరంలో వేణుగోపాలస్వామి వారి తెప్పోత్సవం మూడవ రోజు టీటీడీ ఆధ్వర్యంలో శుక్రవారం వైభవంగా నిర్వహించారు. సాయంత్రం స్వామి వారి ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించి తిరుచ్చి వాహనంపై కొలువు దీర్చి పురవీధుల్లో భక్తులకు దర్శనం కల్పించారు. చివరి రోజు వేణుగోపాలస్వామి తెప్పోత్సవం వీక్షించడానికి కోనేరు వద్దకు భక్తులు భారీ ఎత్తున విచ్చేశారు.