News August 8, 2025
పుతిన్‌కు మోదీ ఫోన్.. భారత పర్యటనకు ఆహ్వానం

రష్యాతో భారత్ బంధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ప్రధాని మోదీ స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. ఆయనను భారత్‌లో పర్యటించాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌తో యుద్ధం విషయాన్ని పుతిన్ మోదీ దృష్టికి తీసుకొచ్చారు. అటు ఇప్పటికే రష్యా పర్యటనలో ఉన్న జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పుతిన్‌తో భేటీ అయ్యారు. ఈ ఏడాది చివర్లో ఆయన ఇండియాలో పర్యటిస్తారని దోవల్ వెల్లడించారు.
Similar News
News August 9, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (ఆగస్టు 9, శనివారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.41 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 5.58 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.22 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.49 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.45 గంటలకు
✒ ఇష: రాత్రి 8.02 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News August 9, 2025
అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలో అడ్మిషన్లు.. ఈనెల 13 వరకే ఛాన్స్

TG: Dr.B.R.అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలో B.A, B.Com, B.Sc, M.A, M.Com, MSc, డిప్లొమా కోర్సుల్లో అడ్మిషన్లకు గడువు ఈనెల 13తో ముగియనుంది. ఇంటర్/ITI, ఓపెన్ ఇంటర్, పాలిటెక్నిక్ పాసైన వారు అర్హులు. <
News August 9, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.