News August 8, 2025
HYD: TG CPGET.. 7,518 మంది హాజరు

రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల కోసం 44 సబ్జెక్టులకు రాష్ట్ర స్థాయి కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ పరీక్షలు (TG CPGET) కొనసాగుతున్నాయి. ప్రతి రోజూ 3 సెషన్లలో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నారు. శుక్రవారం 5 సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహించారు. మొత్తం 8,587 మంది అభ్యర్థులకు గాను.. 7,518 (87.55%) మంది హాజరైనట్లు ఉస్మానియా యూనివర్సిటీ TG CPGET డైరెక్టర్ పాండురంగారెడ్డి తెలిపారు.
Similar News
News August 9, 2025
రాయపర్తిలో యూరియా బస్తాల కోసం పాదరక్షల క్యూ

దేశానికి తిండి పెట్టడం కోసం ఆరుగాలం శ్రమించే అన్నదాతలు యూరియా బస్తాల కోసం పడరాని పాట్లు పడుతున్నారు. పంటల సాగులో కీలకమైన యూరియా కోసం రైతన్నలు చెప్పరాని తిప్పలు ఎదుర్కొంటున్నారు. రాయపర్తిలోని PACSకు యూరియా బస్తాలు వచ్చాయనే సమాచారంతో మండలంలోని రైతులంతా పెద్ద ఎత్తున శుక్రవారం వేకువజాము నుంచే బారులు తీరారు. ఎండలో లైన్లో నిలబడలేక సాయంత్రం వేళ చెప్పులను క్యూగా పెట్టి యూరియా బస్తాలు తీసుకున్నారు.
News August 9, 2025
సిద్దిపేట: గంజాయి అమ్మడానికి ప్రయత్నం.. ఇద్దరి అరెస్ట్

గంజాయి అమ్మడానికి ప్రయత్నిస్తున్న ఇద్దరిని పట్టుకుని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు సిద్దిపేట 3వ టౌన్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్ తెలిపారు. మిట్టపల్లికి చెందిన సిద్దరబోయిన అఖిల్ (21) పవన్ కుమార్ (20) శుక్రవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో నాంచార్ పల్లి, బక్రీ చేప్యాల శివారులో గంజాయి అమ్మడానికి ప్రయత్నించారు. నమ్మదగిన సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు, 3వ టౌన్ SI చంద్రయ్య వెళ్లి పట్టుకున్నారు.
News August 9, 2025
‘మహావతార్ నరసింహ’.. రూ.136 కోట్లకు పైగా వసూళ్లు

యానిమేటెడ్ సినిమా ‘మహావతార్ నరసింహ’ విడుదలై రెండు వారాలైనా బాక్సాఫీసు వద్ద దూసుకెళ్తోంది. అన్ని భాషల్లో కలిపి 14 రోజుల్లో రూ.136 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. కేవలం హిందీలోనే రూ.84.44Cr నెట్ కలెక్షన్స్ వచ్చాయి. హిందీలో తొలి వారం ₹ 32.82cr, రెండో వారంలో అంతకుమించి ₹51.62cr వసూలు చేసినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ మూవీకి అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించారు.