News August 8, 2025

నెల్లూరులో డిజైన్స్ బట్టి అదిరిపోయే రేట్లు

image

అన్నాచెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల ప్రేమకు ప్రతీకగా భావించే రాఖీ పండగ సందడి నెల్లూరులో మొదలైంది. ఎటు చూసినా అందమైన డిజైన్ల రాఖీలే దర్శనమిస్తున్నాయి. అన్నదమ్ములకు రాఖీలు కట్టేందుకు మహిళలు దుకాణాలకు క్యూ కట్టారు. దీంతో నెల్లూరులోని పలు దుకాణదారులు రాఖీల రేట్లు అమాంతం పెంచేశారు. రూ.30 నుంచి రూ.500 వరకు రాఖీల రేట్లు ఉన్నాయి. వెండి రాఖీలు సైతం మార్కెట్లో దర్శనమిస్తున్నాయి.

Similar News

News August 9, 2025

నెల్లూరు: పలు దేవస్థాన ఆలయ కమిటీలకు నోటిఫికేషన్

image

నెల్లూరులో నామినేటెడ్ పదవుల సందడి మొదలు కాబోతోంది. ఆలయ పాలకమండలి ఛైర్మన్లకు, సభ్యులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. నెల్లూరులోని రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం, వేదగిరి నరసింహస్వామి దేవస్థానం, మూలస్థానేశ్వర స్వామి దేవస్థానంతో పాటు ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన ఆలయ కమిటీలకు నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో చైర్మన్ పదవులను, బోర్డు మెంబర్స్ పదవులను దక్కించుకునేందుకు ఆశావాహులు పోటీ పడుతున్నారు.

News August 8, 2025

మాజీ మంత్రి కాకాణికి బెయిల్ మంజూరు

image

నెల్లూరు జిల్లా సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి మరో కేసులో బెయిల్ వచ్చింది. కనుపూరు చెరువులో అక్రమంగా గ్రావెల్ తవ్విన కేసులో అయన A1గా ఉన్నారు. ఈ కేసులో ఆయనకు గురువారం బెయిల్ మంజూరు చేస్తూ నాలుగో అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ తీర్పునిచ్చారు. పోలీసుల విచారణకు సహకరించాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. అక్రమ మైనింగ్ కేసులో ప్రస్తుతం ఆయన సెంట్రల్ జైలులో ఉన్నారు.

News August 8, 2025

ఈ నెల 18 నుంచి వెంకయ్య స్వామి ఆరాధన మహోత్సవాలు

image

ఈనెల 18 నుంచి 24 వరకు వెంకటాచలం మండలం గొలగమూడిలో వెలసిన శ్రీ వెంకయ్య స్వామి ఆరాధన మహోత్సవాలు జరగనున్నాయి. ఈ మహోత్సవాలను అత్యంత భక్తిశ్రద్ధల మధ్య నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. అన్ని శాఖలను సమన్వయం చేసుకొని భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ఆర్డిఓ అనూష ఆధ్వర్యంలో ఏవో బాలసుబ్రమణ్యం, అన్ని శాఖల అధికారులు హాజరయ్యారు.