News August 8, 2025
నిజామాబాద్: గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

ఇందల్వాయి మండలం దేవి తాండ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో బాలాజీ (50) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. శుక్రవారం రూప్లా నాయక్ తండా నుంచి దేవి తాండ గ్రామానికి నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో ఎన్హెచ్ 44 జాతీయ రహదారిపై హైదరాబాద్ వైపు నుంచి వేగంగా వచ్చిన గుర్తు తెలియని వాహనం అతడిని ఢీకొంది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సందీప్ తెలిపారు.
Similar News
News August 30, 2025
NZB: ‘ఈనెల 30 వరకు అభ్యంతరాలకు అవకాశం’

నిజామాబాద్ జిల్లాలో మండల, గ్రామ పంచాయతీ, వార్డుల వారీగా విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితాపై అభ్యంతరాలు ఉంటే ఈనెల 30లోగా తెలియజేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. అభ్యంతరాలను పరిశీలించి, అవసరమైన మార్పులు చేసిన తర్వాత సెప్టెంబర్ 2వ తేదీన వార్డుల వారీగా, ఫొటోతో కూడిన తుది ఓటరు జాబితాను ప్రకటిస్తామని కలెక్టర్ తెలిపారు.
News August 29, 2025
నిజామాబాద్: రేపటి నుంచి తెలంగాణ యువ ప్రో కబడ్డీ లీగ్

హైదరాబాద్లో రేపటి నుంచి తెలంగాణ యువ ప్రో కబడ్డీ లీగ్ ప్రారంభం కానుంది. ఈ లీగ్లో పాల్గొనే శాతవాహన జట్టు క్రీడాకారులు నిజామాబాద్ జిల్లాలో తమ శిక్షణ పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకున్నారు. జట్టుకు జిల్లాకు చెందిన మీసాల ప్రశాంత్ కోచ్గా వ్యవహరించనున్నారు. క్రీడాకారులు అద్భుతమైన ప్రతిభ కనబరిచి విజయం సాధించాలని జిల్లా కబడ్డీ సంఘం అధ్యక్షుడు, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు ఆకాంక్షించారు.
News August 29, 2025
నిజామాబాద్: రాష్ట్రంలోనే టాప్ తూంపల్లి

నిజామాబాద్ జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలో అతి నుంచి అత్యంత భారీ వర్షం కురిసింది. సిరికొండ మండలం తూంపల్లిలో గడిచిన 24 గంటల్లో ఏకంగా 233.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో ఎక్కడ చూసినా వరద నీరే కనిపిస్తోంది. వాగులు వంకలు పొర్లుతున్నాయి. చెరువులు, కుంటలు మత్తళ్లు దూకుతున్నాయి.