News March 31, 2024
నేడు విశాఖ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

విశాఖ వైయస్సార్ క్రికెట్ స్టేడియంలో ఆదివారం రాత్రి 7.30 గంటల నుంచి 11.30 గంటల వరకు ఢిల్లీ చెన్నై జట్ల మధ్య జరగనున్న ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. స్టేడియం సామర్థ్యం 28,000 కాగా వాహనాల్లో భారీగా అభిమానులు వచ్చే అవకాశం ఉన్నందున వాహనదారులు మధురవాడ స్టేడియం వైపు ప్రయాణించకుండా వేరే మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.
Similar News
News March 7, 2026
విశాఖ: పన్నులు చెల్లించకుంటే జప్తే

ఆర్థిక సంవత్సరం ముగుస్తుండగా జీవీఎంసీ అధికారులు పన్నుల వసూళ్లపై దృష్టి సారించారు. రూ.650 కోట్ల లక్ష్యాన్ని చేరుకునేందుకు మొండి బకాయిదారులపై చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే 1,36,149 మంది బకాయిదారులను గుర్తించి, 1,10,136 మందికి జప్తు నోటీసులు జారీ చేశారు. నీటి పన్ను చెల్లించని 62,290 మందికి కనెక్షన్లు తొలగిస్తామని హెచ్చరించారు. ప్రస్తుతం రూ.458.9 కోట్లు వసూలు కాగా, రూ.188.20 కోట్లు రావాల్సి ఉంది.
News March 6, 2026
స్టడీ టూర్‌కు పట్టుబడుతున్న జీవీఎంసీ కార్పొరేటర్లు

విశాఖ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు మరోసారి స్టడీ టూర్ నిర్వహించాలని పట్టుబడుతున్నారు. ఈనెల 17తో పాలకవర్గం పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో కనీసం ఒక్కసారి అధ్యయన యాత్రకు అనుమతి ఇవ్వాలని మేయర్, కమిషనర్‌ను కోరుతున్నారు. ఐదేళ్ల కాలంలో నాలుగేళ్లపాటు మాత్రమే యాత్రలు జరిగాయని, ఒక సంవత్సరం మిగిలిపోయిందని వారు చెబుతున్నారు. ఈనెల 10 నుంచి 14 వరకు టూర్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
News March 6, 2026
విశాఖ: 5 నిమిషాల ఆలస్యంతో అవకాశం కోల్పోయారు

రైల్వే టెక్నీషియన్ గ్రేడ్-3 పరీక్షకు ఐదు నిమిషాలు ఆలస్యం కావడంతో సుమారు పది మంది అభ్యర్థులు అవకాశం కోల్పోయారు. పెందుర్తి చినముషిడివాడ డిజిటల్ అయాన్ సెంటర్‌లో శుక్రవారం ఉదయం మొదటి షిఫ్ట్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఉదయం 7:30 నుంచి 8:30 వరకు రిపోర్టింగ్ సమయం కాగా, అభ్యర్థులు 8:35 గంటలకు రావడంతో వారిని అనుమతించలేదు. ఈ పరీక్షకి ఒడిశా నుంచి వచ్చామని, అవకాశం కోల్పోయామని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు.


