News August 8, 2025

ప్రియాంకా గాంధీతో అజారుద్దీన్ భేటీ

image

టీపీసీసీ ఉపాధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్ సీనియర్ కాంగ్రెస్ నేత, ఎంపీ ప్రియాంకా గాంధీని ఢిల్లీలో కలిశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పార్టీ గెలుపునకు చేస్తున్న కృషికి ఆమెకు వివరించారు. కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించబోతుందని ప్రియాంకా గాంధీతో ధీమా వ్యక్తం చేశారు.

Similar News

News September 1, 2025

NIMSలో పిల్లలకు ఉచితంగా గుండె ఆపరేషన్లు

image

నేటి నుంచి పంజాగుట్టలోని నిమ్స్‌లో చిన్నారులకు బ్రిటన్ వైద్య బృందం ఆధ్వర్యంలో ఉచిత గుండె ఆపరేషన్లు జరగనున్నాయి. ఈ శిబిరం సెప్టెంబర్ 21 వరకు జరగనుంది. మంగళ, గురు, శుక్రవారాలలో ఉదయం 8:00 గంటల నుంచి సాయంత్రం 4:00 గంటల వరకు ఆస్పత్రిలో సంప్రదించవచ్చు. పుట్టుకతో గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న పిల్లలను పరీక్షించి, అవసరమైన వారికి శస్త్రచికిత్సలు ఉచితంగా చేస్తారు.
SHARE IT

News August 31, 2025

మోమిన్‌పేటలో భర్తను చంపేసిన భార్య

image

మోమిన్‌పేట మండలం కేసారంలో దారుణం చోటుచేసుకుంది. బంట్వారం మండలం రొంపల్లికి చెందిన కురువ కుమార్ (36), రేణుక (34) భార్యభర్తలు. కేసారంలోని ఒక వెంచర్‌లో పని చేస్తున్నారు. రోజూ మద్యం తాగి భార్యను వేధిస్తున్న కుమార్ ఆదివారం మద్యం మత్తులో వచ్చి రేణుకను కొట్టాడు. వేధింపులు తాళలేక ఆమె భర్త కళ్లల్లో కారం కొట్టింది. ఓ వైర్‌ను మెడకు బిగించి హత్య చేసింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News August 31, 2025

జూబ్లీహిల్స్‌‌లో గెలిపిస్తే ఏడాదిలో లక్ష ఉద్యోగాలు: KA పాల్‌

image

రానున్న ఉప ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీని గెలిపిస్తే ఏడాదిలో నిరుద్యోగులకు లక్ష ఉద్యోగాలను ఇప్పిస్తానని ఆ పార్టీ అధ్యక్షుడు డాక్టర్‌ కేఏ పాల్‌ తెలియజేశారు. యూసుఫ్‌గూడ డివిజన్‌ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. అనంతరం తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్రంగా విమర్శలు చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దేశం అల్లకల్లోలం అవుతోందన్నారు.