News August 8, 2025
పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రలు వేయించాలి: ఆదిలాబాద్ కలెక్టర్

ఈనెల 11న జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా వైద్య ఆరోగ్య, ఇతర శాఖల అధికారులతో ఈరోజు సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. నులిపురుగుల నిర్మూలన కోసం 1 నుంచి 19 ఏళ్లలోపు పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రలు తప్పకుండా వేయించాలని కలెక్టర్ సూచించారు. అన్ని పాఠశాలలు, హాస్టళ్లు, అంగన్‌వాడీ కేంద్రాల్లో ఈ మాత్రలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.
Similar News
News September 1, 2025
ADB: రాష్ట్రస్థాయి పోటీల్లో అశ్వినికి గోల్డ్

మహబూబ్‌నగర్‌లో జరుగుతున్న 11వ రాష్ట్రస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీల్లో ఆదివారం జిల్లా క్రీడాకారిణి సత్తా చాటింది. అండర్ 20 విభాగంలో అశ్విని హైజంప్ ఈవెంట్లో స్వర్ణం గెలుచుకుందని శిక్షకుడు రాకేశ్ తెలిపారు. రాష్ట్రస్థాయిలో సత్తా చాటడం పట్ల డీవైఎస్ఓ జక్కుల శ్రీనివాస్, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అడ్డి భోజారెడ్డి, రాజేశ్ తదితరులు ఆమెను అభినందించారు.
News August 31, 2025
అంకిత భావంతో సేవలందించడం అభినందనీయం : ఎస్పీ

ఏఎస్ఐ ఎస్.దిలీప్ (తాంసి, పీఎస్), ఏఎస్ఐ ముంతాజ్ అహ్మద్ (భీంపూర్ పీఎస్) పదవీ విరమణ పొందిన సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదివారం వారిని సన్మానించారు. 35 ఏళ్లకు పైగా పోలీసు సర్వీసులో చిన్న రిమార్క్ కూడా లేకుండా ఇద్దరూ అంకితభావంతో సేవలందించడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు, ఏఎస్ఐల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
News August 31, 2025
జానపద దినోత్సవాల్లో ADB కళాకారులు

HYDలోని రవీంద్ర భారతి ఆడిటోరియంలో నిర్వహించిన ప్రపంచ జానపద దినోత్సవ సంబరాల్లో ఆదివారం బాలకేంద్రం చిన్నారులు పాల్గొన్నారు. ఎల్లమ్మ బోనాల పాటపై నృత్య ప్రదర్శన చేసి, ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. చిన్నారుల ప్రదర్శనకు నిర్వాహకులు జ్ఞాపికలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జానపద కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కార్యదర్శులు శ్రీనివాస్ గౌడ్, లింగన్న తదితరులు పాల్గొన్నారు.