News March 31, 2024
అమెరికా సైనిక స్థావరంలోకి చొరబడిన చైనీయుడు

అమెరికాలోని కాలిఫోర్నియాలో మెరైన్ కోర్ శిబిరంలోకి ఓ చైనీయుడు చొరబడటం కలకలం రేపింది. అనుమతిలేకుండా లోపలికి వచ్చిన అతడు, బయటికి వెళ్లేందుకు నిరాకరించడంతో సరిహద్దు నిఘా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. చట్టవిరుద్ధంగా దేశంలోకి వచ్చాడని, దర్యాప్తు చేస్తున్నామని వారు తెలిపారు. కాగా.. గత ఏడాది చైనాకు చెందిన నిఘా బుడగలు అమెరికా గగనతలంలో కనిపించడం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.
Similar News
News March 14, 2026
ఇన్‌స్టాలో అవి చూసి మోసపోకండి!

ఇన్‌స్టాలో ఏదైనా వస్తువు కనిపించగానే అరే.. బాగుందే అనుకుంటాం. రేట్ కూడా తక్కువే ఉంది కదా కొందామని చూస్తే COD ఉండదు. వెంటనే ఆన్‌లైన్ పేమెంట్ చేసి బుక్ చేస్తాం. కానీ ఎన్నిరోజులైనా అది మీకు డెలివరీ అవ్వదు. ఎందుకంటే అది ఫేక్ షాపింగ్ వెబ్‌సైట్. ఇలాంటి సైట్లు కుప్పలుగా పుట్టుకొచ్చాయి. ముఖ్యంగా మహిళలు వీటి బారిన పడి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. టెంప్ట్ అవ్వకుండా ట్రస్టెడ్ సైట్లలోనే షాపింగ్ చేయండి.
News March 14, 2026
NDAతో పొత్తు ఉండదు: విజయ్

TNలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో NDAతో పొత్తు ఉండదని TVK చీఫ్ విజయ్ స్పష్టం చేశారు. వారితో కలిసి పోటీ చేసే అవకాశమే లేదని తేల్చి చెప్పారు. పొత్తుపై జరుగుతున్న ప్రచారాలన్నీ ఊహాగానాలే అని ఆ పార్టీ జనరల్ సెక్రటరీ నిర్మల్ కుమార్ ప్రకటించారు. ఈ విషయాన్ని గతంలోనే చెప్పామని గుర్తు చేశారు. BJP తమకు సైద్ధాంతిక శత్రువు అన్నారు. పార్టీ అధికారిక ప్రకటన ఇస్తేనే ఇలాంటి వాటిని నమ్మాలని కార్యకర్తలకు సూచించారు.
News March 14, 2026
హైదరాబాద్ చుట్టూ రీజినల్ రింగ్ రైల్!

TG: హైదరాబాద్ చుట్టూ ఏర్పాటయ్యే రీజినల్ రింగురోడ్డు వెంబడే రీజినల్ రింగ్ రైల్ (RRR) ఏర్పాటుకానుంది. దీని DPR కోసం సర్వేకి అనుమతులు మంజూరు చేసినట్లు కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ లోక్‌సభలో MP కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నకు సమాధానమిచ్చారు. నీతి ఆయోగ్, ఆర్థికశాఖ అనుమతి తరువాత దీనికి తుది అనుమతి లభించనుంది. దీనివల్ల HYD చుట్టూ ఉన్న ప్రాంతాలకు రవాణా సులభం అవడంతో పాటు ఆర్థికాభివృద్ధికి మార్గం ఏర్పడుతుంది.


