News August 9, 2025

మీ నిద్రని ట్రాక్ చేస్తున్నారా?

image

స్లీప్ ట్రాకింగ్‌తో ఎన్నో ప్రయోజనాలుంటాయని వైద్యులు చెబుతున్నారు. ‘స్లీప్ ట్రాకింగ్‌తో మీ నిద్ర, శరీరం స్పందిస్తున్న తీరు తెలుస్తుంది. ఎంతసేపు నిద్రపోయారు, ఎంత క్వాలిటీ నిద్ర పోయారో తెలుసుకోవచ్చు. ఈ రికార్డ్స్‌‌తో చికిత్సలేని కొన్ని నిద్ర సమస్యలను ముందే గుర్తించవచ్చు. దాంతో మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు’ అని సూచిస్తున్నారు. స్మార్ట్ వాచ్, హెల్త్ రింగ్, AI పరికరాలతో మీ నిద్రని ట్రాక్ చేసుకోవచ్చు.

Similar News

News August 9, 2025

పెరుగుతున్న ఎండు మిర్చి ధర

image

TG: ఖమ్మం, వరంగల్ మార్కెట్ యార్డుల్లో ఎండు మిర్చి ధరలు పెరుగుతున్నాయి. గత నెలతో పోలిస్తే అన్ని రకాల మిర్చి క్వింటాల్‌కు రూ.500 పెరిగింది. ఖమ్మం మార్కెట్‌లో నాణ్యమైన తేజా రకం క్వింటాల్‌కు రూ.14,500 వరకు పలుకుతోంది. సగటు ధరలు రూ.13,500 నుంచి రూ.14వేల మధ్యలో ఉన్నాయి. విదేశాలకు ఎగుమతులు పెరగడం, మిర్చి లభ్యత తగ్గడంతో రేట్లు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు.

News August 9, 2025

నేడు రాఖీ పౌర్ణమి.. ఇలా చేయండి

image

లక్ష్మీదేవికి ప్రీతికరమైన శ్రావణ పౌర్ణమి(నేడు)రోజున రాఖీ జరుపుకుంటాం. ఈ రోజు ఉ.9 గంటల నుంచి 10.30 వరకు రాఖీ కట్టడానికి సుముహూర్తం ఉంది. ఉదయాన్నే తల స్నానం చేసి దీపం వెలిగించాలి. పళ్లెంలో రాఖీ, వెండి నాణెం ఉంచి పూజ చేయాలి. అక్కాచెల్లెళ్లు తమ సోదరుడికి రాఖీ కట్టి, హారతి ఇచ్చి, అక్షింతలు వేసి మిఠాయి తినిపించాలి. సోదరులు ప్రేమతో వారికి కానుకలు ఇవ్వాలి. కుటుంబ సంబంధాలను దృఢపరుచుకోవడమే ఈ పండుగ ఉద్దేశం.

News August 9, 2025

ఛార్జీలు పెంచలేదు: TGSRTC

image

TG: రాఖీ పండుగ సందర్భంగా RTC బస్సుల్లో ఛార్జీలు పెంచినట్లు జరుగుతున్న ప్రచారాన్ని సంస్థ ఖండించింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా స్పెషల్ బస్సులు నడుపుతున్నామని, వాటిలో మాత్రమే 30% అదనపు ఛార్జీలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేసింది. రెగ్యులర్ బస్సుల్లో ఎలాంటి పెంపు లేదని పేర్కొంది. స్పెషల్ బస్సుల్లో ఛార్జీల పెంపు కొత్తగా తీసుకున్న నిర్ణయం కాదని, అన్ని పండగలకూ ఈ విధానాన్నే కొనసాగిస్తున్నట్లు పేర్కొంది.