News March 31, 2024
భార్యాభర్తల మధ్య ఎన్నికల చిచ్చు
MPలోని బాలాఘాట్ లోక్‌సభ BSP అభ్యర్థి కంకర్ ముంజరే ఇంట్లో ఎన్నికలు చిచ్చు పెట్టాయి. అతని భార్య అనుభా ప్రస్తుతం కాంగ్రెస్ MLAగా ఉన్నారు. ఈ నేపథ్యంలో వేర్వేరు పార్టీలకు ప్రచారం చేస్తున్న తామిద్దరం ఒకే ఇంట్లో ఉండొద్దని శంకర్ తన భార్యకు చెప్పారు. ఎన్నికల ప్రచారం ముగిసే వరకు ఇంట్లో ఎవరైనా ఒకరే ఉండాలని, ఆమెను వేరే చోటుకు వెళ్లాలని కండిషన్ పెట్టారట. దీంతో అనుభా దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. <<-se>>#Elections2024<<>>
Similar News
News January 2, 2025
ధైర్యముంటే ఆత్మహత్య చేసుకో.. పునీత్ కేసులో సంచలన విషయాలు
ఢిల్లీలో భార్యా బాధితుడు <<15038293>>పునీత్<<>> ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భార్య మణికా, ఆమె పేరెంట్స్ కలిసి పునీత్‌ను మానసికంగా టార్చర్ చేశారని అతని సోదరి తెలిపింది. ‘నువ్వు ఏమీ చేయలేవు, ధైర్యం ఉంటే ఆత్మహత్య చేసుకో’ అని ప్రేరేపించారని వెల్లడించింది. ‘బేకరీలో వాటా, విడాకుల అంశం కోర్టులో ఉన్నప్పటికీ మణికా వేధించేది. పునీత్ ఇన్‌స్టాను హ్యాక్ చేసి ఇతరులతో అసభ్యంగా ప్రవర్తించేది’ అని పేర్కొంది.
News January 2, 2025
సీఎం అధికారిక నివాసంగా ఉండవల్లి గృహం
AP: గుంటూరు జిల్లా ఉండవల్లిలోని గృహాన్ని సీఎం చంద్రబాబు అధికారిక నివాసంగా గుర్తిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. 2024 జూన్ 12 నుంచి ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని పేర్కొంది. 2017 నుంచి 2019 వరకు కూడా సీఎం హోదాలో చంద్రబాబు అక్కడే నివాసం ఉన్నారు. అయితే కృష్ణా నది ఒడ్డున ఉన్న ఆ నిర్మాణం అక్రమమని వైసీపీ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.
News January 1, 2025
BGT: చివరి టెస్టుకు వర్షం ముప్పు
BGTలో భాగంగా సిడ్నీ వేదికగా ఎల్లుండి నుంచి జరిగే చివరి టెస్టుకు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉందని వెదర్ రిపోర్టు వెల్లడించింది. ఈ మ్యాచ్ రద్దయినా, డ్రా అయినా ఆసీస్ 2-1తో సిరీస్ సొంతం చేసుకుంటుంది. దీంతో భారత్ WTC ఫైనల్ ఆశలు గల్లంతవుతాయి. మ్యాచ్‌లో రోహిత్ సేన గెలిస్తే కొద్దిగా ఛాన్స్ ఉంటుంది. ఈ గ్రౌండులో ఇరు జట్ల మధ్య 13 మ్యాచ్‌లు జరగగా IND ఒక్కటే గెలిచింది. 5 ఓడిపోగా, 7 డ్రాగా ముగిశాయి.