News August 9, 2025

నిర్మల్ జిల్లాలో ఘనంగా వరలక్ష్మీ వ్రతం పూజలు

image

నిర్మల్ జిల్లా వ్యాప్తంగా వరలక్ష్మీ పూజలను ఈరోజు ఘనంగా నిర్వహించారు. శ్రావణమాసంలో వచ్చే ఈ వరలక్ష్మీ వ్రతాన్ని మహిళలు ఎంతో నిష్ఠగా చేసుకున్నారు. మహాలక్ష్మి అమ్మవారిని శాస్త్రీయ పద్ధతిలో పూలతో అలంకరించి పూజలు చేశారు. పూజల అనంతరం ఒకరికొకరు వాయనాలు ఇచ్చిపుచ్చుకున్నారు. కుటుంబాల్లో సుఖశాంతులు, అష్టైశ్వర్యాలు ఉండాలని మహిళలు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.

Similar News

News August 9, 2025

నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

image

TGలోని NLG, సూర్యాపేట, MHBD, WGL, HNK, HYD, జనగాం, యాదాద్రి, రంగారెడ్డి, MBNR, NGKL, వనపర్తి, గద్వాల్ జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. మిగతా జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని అంచనా వేసింది. అటు APలోని ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని APSDMA పేర్కొంది.

News August 9, 2025

అన్నదాత సుఖీభవ.. త్వరలో వారి ఖాతాల్లోకి డబ్బులు

image

AP: వివిధ కారణాలతో ‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద సాయం అందని రైతుల నుంచి ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించింది. వ్యవసాయ శాఖ చేపట్టిన గ్రీవెన్స్‌కు ఈ నెల 3 నుంచి 8వ తేదీ వరకు 10,915 దరఖాస్తులు వచ్చాయి. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లా నుంచి 1,290 మంది రైతులు అప్లై చేసుకున్నారు. గ్రీవెన్స్‌లో సమస్య పరిష్కారమై, పథకానికి అర్హులైన వారికి త్వరలో నగదు జమ అవుతుందని అధికారులు స్పష్టం చేశారు.

News August 9, 2025

పెరుగుతున్న ఎండు మిర్చి ధర

image

TG: ఖమ్మం, వరంగల్ మార్కెట్ యార్డుల్లో ఎండు మిర్చి ధరలు పెరుగుతున్నాయి. గత నెలతో పోలిస్తే అన్ని రకాల మిర్చి క్వింటాల్‌కు రూ.500 పెరిగింది. ఖమ్మం మార్కెట్‌లో నాణ్యమైన తేజా రకం క్వింటాల్‌కు రూ.14,500 వరకు పలుకుతోంది. సగటు ధరలు రూ.13,500 నుంచి రూ.14వేల మధ్యలో ఉన్నాయి. విదేశాలకు ఎగుమతులు పెరగడం, మిర్చి లభ్యత తగ్గడంతో రేట్లు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు.