News March 31, 2024
మార్కెటింగ్‌లో ఇండియన్ క్రియేటివిటీకి హద్దు లేదు: ఆనంద్ మహీంద్రా

ఐపీఎల్ క్రేజ్‌ను ఇడ్లీ మార్కెటింగ్‌కు ఉపయోగించుకున్న చెన్నైలోని ఓ హోటల్‌పై పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ప్రశంసలు కురిపించారు. ఇడ్లీ ప్రీమియర్ లీగ్(IPL) అంటూ స్పెషల్ ఆఫర్ ఉన్న ఓ పోస్టర్‌ను Xలో పోస్టు చేశారు. ‘మార్కెటింగ్‌లో భారతీయుల సృజనాత్మకతకు హద్దు లేదు. ఈ ఐపీఎల్ ఆదివారం ఉదయం మంచి రేటింగ్ పొందింది. నేను కూడా ఇడ్లీ హోమ్ డెలివరీ కోసం నా టికెట్ రిజర్వ్ చేసుకున్నా’ అని రాసుకొచ్చారు.
Similar News
News March 20, 2026
అంతరిక్షంలో 129 ఇస్రో వ్యర్థాలు: కేంద్రం

ఇస్రో ప్రయోగించిన రాకెట్ల శకలాలు, ఫెయిలైన శాటిలైట్లు అంతరిక్షంలో 129 ఉన్నాయని కేంద్రం పార్లమెంటులో వెల్లడించింది. వీటిలో 49 ఉపయోగం లేని ఉపగ్రహాలు ఉన్నాయని తెలిపింది. అందులో భూమికి సమీప కక్ష్య(LEO)లో 23, భూస్థిర కక్ష్య(GEO)లో 26 ఉన్నాయంది. మిగిలినవాటిలో PSLV శకలాలు 40, GSLV 4, LVM3 వ్యర్థాలు 3, PSLV-C3 రాకెట్ భాగం విచ్ఛిన్నం కావడంతో ఏర్పడిన 33 శకలాలు కూడా ఉన్నాయని పేర్కొంది.

శనగ రైతుకు కష్టాలు.. ఆదు‘కొనేదెవరు’?

AP: విదేశీ శనగల దిగుమతి సుంకాన్ని కేంద్రం 10 శాతానికి తగ్గించడం, దేశీయ శనగల కొనుగోలుకు చర్యలు తీసుకోకపోవడంతో రైతులు నష్టాలపాలవుతున్నారు. ఈ సీజన్‌లో 8L టన్నుల ఉత్పత్తి రానుండగా 94,500 మె.టన్నుల కొనుగోలుకే కేంద్రం అనుమతించింది. మద్దతు ధర క్వింటాకు రూ.5,875 ప్రకటించగా, వ్యాపారులు రూ.5,000-5,500కు మించి కొనడం లేదు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.