News August 9, 2025
అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలో అడ్మిషన్లు.. ఈనెల 13 వరకే ఛాన్స్

TG: Dr.B.R.అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలో B.A, B.Com, B.Sc, M.A, M.Com, MSc, డిప్లొమా కోర్సుల్లో అడ్మిషన్లకు గడువు ఈనెల 13తో ముగియనుంది. ఇంటర్/ITI, ఓపెన్ ఇంటర్, పాలిటెక్నిక్ పాసైన వారు అర్హులు. <
Similar News
News August 9, 2025
రానున్న రెండు గంటల్లో ఈ జిల్లాల్లో వర్షాలు

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉ.10 గంటల లోపు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, నారాయణపేట్, సూర్యాపేట్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, జనగామ, సంగారెడ్డి, వికారాబాద్, సిద్దిపేట, హన్మకొండ, వరంగల్, మెదక్ జిల్లాల్లో వానలు పడొచ్చని పేర్కొంది. అటు రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
News August 9, 2025
APPLY: రూ.96 వేల జీతంతో 550 ఉద్యోగాలు

ది న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్(NIACL) 550 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. జనరలిస్ట్స్, ఐటీ స్పెషలిస్ట్స్, రిస్క్ ఇంజినీర్స్, ఏఓ, బిజినెస్ అనలిస్ట్స్ వంటి పోస్టులు ఉన్నాయి. డిగ్రీ/పీజీ/బీటెక్, ఎంబీఏ/ఎంబీబీఎస్ పాసై ఉండాలి. 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. నెలకు జీతం రూ.50,925 నుంచి రూ.96,765 వరకు ఉంటుంది. ఈ నెల 30లోగా <
News August 9, 2025
రాఖీ కడుతున్నారా.. ఎన్ని ముళ్లు వేయాలంటే?

ఇవాళ రాఖీ పండగ. ఆడబిడ్డలు తమ సోదరులకు రాఖీ కట్టేందుకు సిద్ధమవుతున్నారు. అయితే రాఖీ కట్టేటప్పుడు తప్పనిసరిగా 3 ముళ్లు వేయాలని పండితులు చెబుతున్నారు. అది బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ప్రతీక అంటున్నారు. మొదటి ముడి సోదరుడి దీర్ఘాయుష్షు, భద్రత, శ్రేయస్సును.. రెండో ముడి సోదరసోదరీమణుల మధ్య విడదీయరాని ప్రేమ, నమ్మకం, గౌరవాన్ని.. మూడో ముడి సోదరుడు జీవితంలో ఎల్లప్పుడూ సన్మార్గంలోనే నడవాలని సూచిస్తుంది.